చంద్రబాబు వల్లే ఎన్టీఆర్ మరణం: వీహెచ్ | mp hanumantha rao demands re enquiry on ntr's death | Sakshi
Sakshi News home page

చంద్రబాబు వల్లే ఎన్టీఆర్ మరణం: వీహెచ్

Nov 24 2014 6:29 PM | Updated on Sep 2 2017 5:03 PM

చంద్రబాబు వల్లే ఎన్టీఆర్ మరణం: వీహెచ్

చంద్రబాబు వల్లే ఎన్టీఆర్ మరణం: వీహెచ్

ఎన్టీ రామారావు మరణంపై మళ్లీ విచారణ చేయాలని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు డిమాండ్ చేశారు.

చంద్రబాబు చేసిన అవమానం వల్లే ఎన్టీ రామారావు మరణించారని, ఆయన మరణంపై మళ్లీ విచారణ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాస్తానని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు తెలిపారు. టీడీపీ నేతలు ఇప్పుడు ఎన్టీఆర్ మీద లేనిపోని ప్రేమాభిమానాలు కురిపిస్తున్నారన్నారు. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టించింది కాంగ్రెస్ పార్టీయేనని వీహెచ్ తెలిపారు.

కావాలంటే బేగంపేట విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టుకోవాలి గానీ, శంషాబాద్ డొమెస్టిక్ టెర్మినల్కు మాత్రం రాజీవ్ గాంధీ పేరు ఉండాల్సిందేనన్నారు. దీనికోసం పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద మంగళవారం ధర్నా చేస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement