మల్కాజిగిరి నియోజకవర్గానికి పాలకుడు ఎవరు? | Who Is The Ruler Of Malkajigiri Constituency | Sakshi
Sakshi News home page

మల్కాజిగిరి నియోజకవర్గానికి పాలకుడు ఎవరు?

Published Wed, Aug 2 2023 3:54 PM | Last Updated on Thu, Aug 17 2023 12:59 PM

Who Is The Ruler Of Malkajigiri Constituency - Sakshi

మల్కాజిగిరి నియోజకవర్గం

మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టిఆర్‌ఎస్‌ అభ్యర్దిగా పోటీచేసిన మైనంపల్లి హనుమంతరావు ఘన విజయం సాదించారు. గతంలో ఆయన ఒకసారి రామాయంపేట ఉప ఎన్నికలోను, ఆ తర్వాత మెదక్‌ నుంచి అసెంబ్లీకి టిడిపి పక్షాన గెలిచారు. 2014 లో టిఆర్‌ఎస్‌ లో చేరి లోక్‌ సభకు పోటీచేసి ఓడిపోయారు.ఆ తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు. 2018 ఎన్నికలలో అసెంబ్లీకి  మల్కాజిగిరి నుంచి ఎన్నికయ్యారు. ఆయన తన సమీప బిజెపి ప్రత్యర్ది, ఎమ్మెల్సీ ఎన్‌. రామచంద్రరావుపై 73698 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. ఇక్కడ నుంచి తెలంగాణ జనసమితి పక్షాన పోటీచేసిన మాజీ ఎమ్మెల్సీ దిలీప్‌ కుమార్‌ కు 34 వేలకుపైగా ఓట్లు వచ్చాయి.

తెలంగాణ జనసమితి మహాకూటమిలో భాగంగా ఉంది.మైనంపల్లి హనుమంతరావుకు 114149 ఓట్లు రాగా, రామచంద్రరావుకు 40451 ఓట్లు వచ్చాయి. హనుమంతరావు వెలమ సామాజికవర్గానికి చెందిన నేత. రామచంద్రరావు 2014లో కూడా బిజెపి తరపున పోటీచేసి ఓటమి చెందారు. అప్పుడు టిడిపితో పొత్తుతో పోటీచేయగా, ఈసారి ఒంటరిగా నిలబడిరది. 2014 ఎన్నికలో  తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్ది కనకారెడ్డి విజయం సాధించారు. కనకారెడ్డికి 2768 ఓట్ల ఆదిక్యత వచ్చింది. 2009 నుంచి ఏర్పడిన ఈ నియోజకవర్గంలో ఒక వెలమ, ఒక రెడ్డి, ఒక బిసి నేత(మున్నూరు కాపు) విజయం సాధించారు.

మల్కాజిగిరి నియోజకవర్గంలో గెలిచిన‌.. ఓడిన అభ్య‌ర్థులు వీరే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement