గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ చాలా గొప్పది

MLA Planted in Nalgonda Government Hospital - Sakshi

నల్లగొండ టూటౌన్‌ : సీఎం కేసీఆర్‌ ప్రారంభించిన హరితహారం కార్యక్రమం స్పూర్తితో రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ చాలా గొప్పదని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. మీడియా అకాడమీ చైర్మన్, టీయూడబ్ల్యూజే (143) రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ పిలుపు మేరకు సోమవారం నల్లగొండ జిల్లాకేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో గ్రీన్‌ చాలెంజ్‌లో భాగంగా ఎమ్మెల్యే జర్నలిస్టులతో కలిసి  మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు గ్రీన్‌ చాలెంజ్‌ స్వీకరించి మొక్కలు నాటడడం యువతకు స్పూర్తిదాయకమని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ప్రజలు, యువతలో మార్పు వచ్చి వారి ఇళ్ల ముందు మొక్కలు నాటి పెంచుకుంటారని తెలిపారు.

అనంతరం ఆసుపత్రి ఆవరణలో ఉన్న వెల్‌నెస్‌ సెంటర్‌ను సందర్శించి ఉద్యోగులు, జర్నలిస్టులకు అందుతున్న వైద్య సేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.  ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (143) జిల్లా అధ్యక్షుడు క్రాంతి, ప్రధాన కార్యదర్శి గుండగోని జయశంకర్‌గౌడ్, ఎలక్ట్రానిక్‌ మీడియా అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు మర్రి మహేందర్‌రెడ్డి, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ పుల్లారావు, అబ్బగోని రమేష్, రావుల శ్రీనివాస్‌రెడ్డి, వివిధ దిన పత్రికలు, వీడియో, ఫొటో జర్నలిస్టులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top