నిధులు మంజూరు చేయండి: ఎమ్మెల్యే

MLA Harish Rao Asks The Govt. To Release Funds To Develop The Chinthamadaka - Sakshi

సాక్షి, సిద్దిపేట: సభ ప్రారంభంలో హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రతీ కుటుంబానికి లబ్ధి చేకూర్చే విధంగా చూడాలని సీఎం ఆదేశాలు జారీ చేశారని అన్నారు. చింతమడక నుంచి ఎల్లాపూర్, రాజక్కపేట, అంకంపేట నుంచి హసన్‌మీరాపూర్, దమ్మచెరువు నుంచి వడిగలగడ్డ వరకు రోడ్లు వేసేందుకు నిదులు మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా చింతమడక గ్రామంలో ఉన్న 98 ఎకరాల అటవీ భూమిని అభివృద్ధి చేయాలని కోరారు.

యువజన సంఘాలకు భవనం, లైబ్రరీ, ఫంక్షన్‌ హాల్, శ్మశాన వాటిక, డంప్‌యార్డు, రైతు బజారు మంజూరి కోసం రూ.10 కోట్లు మంజూరు చేయాలని కోరారు. రామాలయం పున:నిర్మాణం అవుతుందని, శివాలయం అభివృద్ధికి నిధులు కేటాయించాలని అన్నారు. చింతమడకలో ప్రాథమిక ఆసుపత్రి, పశువుల దవాఖానా మంజూరు చేయడం ద్వారా ప్రజలకు సౌకర్యవంతంగా ఉందని చెప్పారు. అయితే నియోజకవర్గంలోని నారాయణరావుపేట, చిన్నకోడూరు, నంగునూరు, మండల కేంద్రాల అభివృద్ధికి రూ. కోటి చొప్పున మంజూరు చేయాలని కోరారు.

అదేవిధంగా నియోజకవర్గంలోని 81 గ్రామాలకు ఒకొక్క గ్రామానికి రూ.25లక్షల చొప్పున మంజూరి చేయాలని ఈ సందర్భంగా కోరారు. సిద్దిపేట అభివృద్ధికి మరిన్ని నిధులు విడుదల చేయాలని హరీశ్‌రావు కోరారు.  మీరు అభివృద్ధి బాటలో నడిపించిన సిద్దిపేటకు తను ఎమ్మెల్యే కావడం గర్వంగా ఉందని,  ఆదేశాలను తూచా తప్పకుండా పాటించి సిద్దిపేటను అన్ని రంగల్లో రాష్ట్రానికే ఆదర్శంగా నిలపుతామని చెప్పారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top