అందుకే గిరిజన వర్సిటీ ఆలస్యం: సత్యవతి రాథోడ్‌

Minister Satyavathi Rathod Speech In Assembly Over Tribal Welfare - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లులోనే గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు అంశం ఉందని గిరిజన, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ పేర్కొన్నారు. గిరిజన ప్రాంతంలోనే ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం.. ములుగు నియోజకవర్గం జాకారంలో స్థలాన్ని కేటాయించిందన్నారు. ప్రత్యేకంగా యూత్‌ ట్రైయినింగ్‌ సెంటర్‌ భవనాన్ని సైతం కేటాయించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అనుమతులివ్వకపోవడంతో వర్సిటీ కార్యక్రమాలు ప్రారంభం కాలేదని తెలిపారు. బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా సోమవారం జరిగిన పద్దు లపై చర్చలో సత్యవతి రాథోడ్‌ మాట్లాడారు.

వారి సమస్యలు నాకు తెలుసు..
గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఒక మహిళకు బాధ్యత అప్పగించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. గిరిజనులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలేంటో తనకు బాగా తెలుసని, వాటిని పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తానని చెప్పారు. సోమవారం డీఎస్‌ఎస్‌ భవన్‌లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఆమె బాధ్యతలు స్వీకరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top