మంత్రి రామన్నను కలిసిన ఎస్పీ | minister Ramanna met of SP | Sakshi
Sakshi News home page

మంత్రి రామన్నను కలిసిన ఎస్పీ

May 29 2016 1:48 AM | Updated on Jul 11 2019 8:34 PM

మంత్రి రామన్నను కలిసిన ఎస్పీ - Sakshi

మంత్రి రామన్నను కలిసిన ఎస్పీ

జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ విశ్రాంతి భవనంలో రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగురామన్నను శనివారం జిల్లా ఎస్పీ....

ఆదిలాబాద్ క్రైం : జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ విశ్రాంతి భవనంలో రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగురామన్నను శనివారం జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం మంత్రితో సమావేశమయ్యారు. జిల్లాలో శాంతిభద్రతలు కాపాడుతూ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని మంత్రి పేర్కొన్నారు. సమావేశంలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, టీఆర్‌ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోకభూమారెడ్డిలు ఉన్నారు.

ఎస్పీకి అధికారులు, సంఘాల స్వాగతం..
నూతన బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్‌ను వివిధ శాఖల అధికారులు, పలు సంఘాల నేతలు కలిసి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించారు. ఎస్పీని కలిసిన వారిలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ అనిత, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రమణారెడ్డి, మున్సిపల్ వైస్ చెర్మైన్ ఫారుఖ్ అహ్మద్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు జగదీష్ అగర్వాల్, జాగృతి కన్వీనర్ శ్రీనివాస్, రవికుమార్, తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement