‘బయ్యారం ఉక్కుపై కేంద్రం నాన్చుతోంది’

Minister KTR visits Bhadradri Kothagudem district - Sakshi

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం : బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయంలో కేంద్రం నాన్చుడు ధోరణి అవలంభిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. కొత్తగూడెంలో స్కిల్ డెవలప్‌సెంటర్, ఆరోగ్య లక్ష్మీ కేంద్రాలను మంగళవారం కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బయ్యారం ఉక్కు కర్మాగారం కోసం పార్లమెంట్‌లో పోరాడుతున్నామన్నారు. ఇనుము లేని విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టిన ప్రభుత్వం, బయ్యారంలో ఎందుకు పెట్టడంలేదని నిలదీస్తున్నా స్పందించడం లేదని మండిపడ్డారు.

కేంద్రం ముందుకు రాకపోయినా సింగరేణి, టీఎస్‌ఎండీసీ సహకారంతో తెలంగాణ ప్రభుత్వం బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశారు. రూ. 100 కోట్లతో భద్రాచలాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా పది లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top