పరిశుభ్రత మన బాధ్యత..

Minister KTR Attend Pattana Pragathi Programme In Khammam District - Sakshi

‘పట్టణ ప్రగతి’ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌

సాక్షి, ఖమ్మం: పట్టణాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత మనదేనని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా ఇల్లందు పట్టణంలో పలు అభివృద్ధి పనులకు కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం పట్టణ ప్రగతి కార్యక్రమంలో కౌన్సిలర్లు, వార్డు కమిటీ సభ్యులు, స్పెషల్‌ ఆఫీసర్లతో నేరుగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి పైనే ప్రభుత్వం దృష్టి సారించిందని నిబద్ధత,చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్పారు.

ప్రతి నెలా క్రమం తప్పకుండా రాష్ట్రంలో ఉన్న పంచాయతీలు, మున్సిపాలిటీలకు రూ.487 కోట్లు నిధులు విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతి వార్డులో విరివిగా మొక్కలు నాటి, సంరక్షించాన్నారు. డ్రైనేజీ వ్యవస్థ, మురికి కాల్వలు శుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి  సూచించారు. విద్యుత్‌ సమస్యలను ఎప్పుడో అధిగమించామని.. తాగునీటి సమస్య పరిష్కరించడానికే మిషన్‌ భగీరథను చేపట్టామని కేటీఆర్‌ తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top