మంత్రి జోగురామన్నకు తప్పిన ప్రమాదం | Minister Jogu Ramanna Escapes From Lift Accident  | Sakshi
Sakshi News home page

మంత్రి జోగురామన్నకు తప్పిన ప్రమాదం

Jul 30 2018 2:27 PM | Updated on Jul 30 2018 3:37 PM

Minister Jogu Ramanna Escapes From Lift Accident  - Sakshi

తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్నకు తృటిలో ప్రమాదం తప్పింది.

సాక్షి, మంచిర్యాల : తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్నకు తృటిలో ప్రమాదం తప్పింది. ఓ ప్రైవేటు ఆస్పత్రి ప్రారంభోత్సవానికి జోగు రామన్న సోమవారం ఉదయం మంచిర్యాలకు వచ్చారు. ఆసుపత్రిని ప్రారంభించిన తర్వాత ఇతర విభాగాలను పరిశీలించేందుకు లిఫ్ట్‌లో వెళ్తుండగా లిఫ్ట్ వైర్‌ తెగిపడింది.

ఈ ప్రమాదంలో జోగు రామన్నకు ఎలాంటి గాయాలు అవ్వలేదు. లిఫ్ట్ నుంచి బయటకు వచ్చిన మంత్రి, మిగతా కార్యక్రమాల్లో యథావిధిగా పాల్గొన్నారు. సామర్ధ్యానికి మించి ఎక్కువ మంది లిఫ్ట్‌లో ఎక్కడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement