వలసకూలీ దుర్మరణం | Migrant worker killed in gopal peta | Sakshi
Sakshi News home page

వలసకూలీ దుర్మరణం

Mar 19 2016 2:14 AM | Updated on Aug 30 2018 4:07 PM

వలసకూలీ దుర్మరణం - Sakshi

వలసకూలీ దుర్మరణం

పొట్ట చేతపట్టుకుని బతుకుదెరువు కోసం నగరానికి వలస వె ళ్లి న ఓ కుటుంబం పెద్ద దిక్కును కో ల్పో యి వీధిన పడింది..

వలసకూలీ దుర్మరణంతో వీధిన పడిన కుటుంబం
కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు, బంధువులు

గోపాల్‌ పేటలో విషాదఛాయలు

 గోపాల్‌పేట :  పొట్ట చేతపట్టుకుని బతుకుదెరువు కోసం నగరానికి వలస వె ళ్లి న ఓ కుటుంబం పెద్ద దిక్కును కో ల్పో యి వీధిన పడింది.. రోడ్డు ప్రమాదం లో కుటుంబ యజమాని దుర్మరం చెం దడంతో వారు కన్నీరు మున్నీరయ్యా రు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాలిలా ఉన్నాయి. గోపాల్‌పేటలోని ఈ దమ్మగడ్డకాలనీకి చెందిన దాసర్ల బా బు (32) కు భార్య అలివేలతోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఏడాది క్రితం కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాదుకు వలస వెళ్లాడు. అప్పటి నుంచి నగరంలోని సంతోష్‌నగర్‌లో నివాసముంటూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో భార్యాభర్తలు కూలి పనిచేస్తున్నారు.

ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం అక్కడ నా లుగు లైన్ల రోడ్డు డివైడర్ పనుల్లో నిమగ్నమైన భర్తను లారీ వేగంగా వచ్చి ఢీకొనడంతో అక్కడిక్కడే చనిపోయాడు. విష యం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకుని బోరుమన్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యా దు చేయడంతో లారీ డ్రైవర్‌పై కేసు దర్యాప్తు జరుపుతున్నారు. శుక్రవారం సాయంత్రం ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీం తో వారు రాత్రి స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement