27న మెగా జాబ్ ఫెయిర్ | Mega Job Fair on April 27 | Sakshi
Sakshi News home page

27న మెగా జాబ్ ఫెయిర్

Sep 25 2014 2:03 AM | Updated on Sep 2 2017 1:54 PM

నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేం దుకు కృషిచేస్తున్నామని ఉపాధి శిక్షణశాఖ అదనపు సంచాలకులు, తెలంగాణ ఓవర్‌సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (టామ్‌కామ్) అధికారి పి.ధర్మరాజు తెలిపారు.

విజయనగర్‌కాలనీ: నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేం దుకు కృషిచేస్తున్నామని ఉపాధి శిక్షణశాఖ అదనపు సంచాలకులు, తెలంగాణ ఓవర్‌సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (టామ్‌కామ్) అధికారి పి.ధర్మరాజు తెలిపారు. నగరంలోని 38 సంస్థల అభ్యర్ధన మేరకు  3159 ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ నెల 27న మెహిదీపట్నంలో మెగా జాబ్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

రంగారెడ్డి జిల్లా ఉపాధి శిక్షణాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ జాబ్ ఫెయిర్ మెహిదీపట్నం పుల్లారెడ్డి కళాశాలలో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. బుధవారం విజయనగర్‌కాలనీలోని టామ్‌కామ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన జాబ్‌ఫెయిర్‌కు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
 
జాబ్‌ఫెయిర్‌లో ప్రముఖ కంపెనీలు

నిస్సాన్ కంపెనీ-చెన్నై, వరుణ్ మోటార్స్, వసంత టూల్స్ ఆండ్ క్రాఫ్ట్స్, హర్ష టయోటా, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, ఇన్‌బిస్కో, ెహ టిరోల్యాబ్స్, వెరిబ్యాటిం, సిప్రాల్యాబ్స్, గ్రీన్‌పార్క్ హోటల్, ఏజీస్, ఈమౌకా, ఎంఎస్‌ఎన్ ల్యాబ్ తదితర కంపెనీలు పాల్గొంటాయి. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి రీజియన్ ఆర్‌ఈవో టామ్‌కామ్ జనరల్ మేనేజర్ కె.భవానీ, రంగారెడ్డి జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం అధికారి ఆర్.జగన్నాథం, ఉపాధి అధికారులు ఎ.పరమేశ్వర్ రెడ్డి, ఎస్. సుబ్బారామయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement