అనుమానాస్పద స్థితిలో..వైద్య విద్యార్థిని మృతి | Medical student died | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో..వైద్య విద్యార్థిని మృతి

Jun 23 2014 1:13 AM | Updated on Oct 9 2018 7:52 PM

అనుమానాస్పద స్థితిలో..వైద్య విద్యార్థిని మృతి - Sakshi

అనుమానాస్పద స్థితిలో..వైద్య విద్యార్థిని మృతి

వివాహితురాలైన ఓ వైద్య విద్యార్థిని ఆదివారం ఖమ్మంలోని తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృ తిచెందింది. ఆమె ఆత్మహత్య చేసుకుందని భర్త చెబుతుండగా..

 ఖమ్మం అర్బన్ : వివాహితురాలైన ఓ వైద్య విద్యార్థిని ఆదివారం ఖమ్మంలోని తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృ తిచెందింది. ఆమె ఆత్మహత్య చేసుకుందని భర్త చెబుతుండగా.. తన కూతురిని అల్లుడే చంపాడని మృతురాలి తల్లి ఆరోపిస్తోంది. వివరాలు.. నల్గొండ జిల్లా సూ ర్యాపేటకు చెందిన చిప్పలపల్లి రాశి(29)  ఖమ్మంలోని మమత మెడికల్ కళాశాలలో వైద్య విద్యనభ్యసిస్తుంది. కాగా రాశి ఇదే కళాశాలలో వైద్య విద్యనభ్యసిస్తున్న ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌కు చెందిన పుప్పాల చైతన్య గత ఏడాది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. స్థాని క మమత రోడ్డులోగల అపార్ట్‌మెంట్ వీరు నివసిస్తున్నారు. పెళ్లయిన కొద్ది కాలానికే వీరి మధ్య కలతలు ఏర్పడ్డాయి.
 
 తన భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నదంటూ ఆదివారం తెల్లవారుజామున అపార్ట్‌మెం ట్‌లోని చుట్టపక్కల ప్లాట్లలోని వారికి చైతన్య చెప్పాడు. వారు వచ్చేసరికి రాశి ఫ్యాన్‌కు ఉరివేసుకుని కని పిం చింది. ఆమెను భర్త చైతన్య కిందకు దించి తన మిత్రు ల సహాయంతో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తన కూతురిని అల్లుడే చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఖానాపురం పోలీస్‌స్టేషన్లో మృతురాలి తల్లి ఉప్పలమ్మ ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి,  మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు ఖానాపురం ఎస్‌ఐ శంకర్ తెలిపారు.
 డాక్టర్‌గా చూడాలనుకున్నా..
 
 ‘నా బిడ్డను డాక్టర్‌గా చూడాలనుకున్నా... అల్లుడు పొట్టనబెట్టుకుని, ఇలా అప్పగించాడు’ అంటూ మృతు రాలి తల్లి ఉప్పలమ్మ గుండెలవిసేలా రోదించారు. నల్లగొండ జిల్లా సూర్యాపేటలో నివసిస్తున్న రాశి తల్లి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. 2006లో మమత మెడికల్ కళాశాలలో తన కూతురిని ఎంబీబీఎస్‌లో చేర్పిం చినట్లు చెప్పారు. ఇదే కళాశాలలో చదువుతున్న పుప్పా ల చైతన్య.. ప్రేమించానంటూ నమ్మించి 2013లో తన కూతురిని కులాంతర వివాహం చేసుకున్నాడని పేర్కొన్నారు. వారు కొన్నినెలలు అన్యోన్యంగానే ఉన్నారని, ఆ తర్వాత అదనపు కట్నం తేవాలంటూ  రాశిని భర్తతోపాటు అత్తామామలు జ్యోతి, గణేష్ వేధించసాగారని ఆరోపించారు.
 
 అంతేకాకుండా మీది తక్కువ కులమం టూ చైతన్య తల్లిదండ్రులు అనేకసార్లు అవమానించిన ట్లు ఆవేదన వ్యక్తం చేశారు. చైతన్యకు వివాహేతర సం బంధం ఉందని, రాశిని వేధించడానికి ఇది కూడా ఒక కారణమని ఆమె వాపోయారు.వారిది ప్రేమ వివాహమైనప్పటికీ కట్నంకింద 2 కిలోల వెండి, రూ.15లక్షల నగదు, ఇంట్లో సామగ్రి కొనేందుకు మరో ఐదు లక్షలు ఇచ్చినట్లు చెప్పారు. శనివారం అర్థరాత్రి రాశి ఫోన్‌చేసి భర్త వేధింపులు భరించలేకపోతున్నా.. వచ్చేస్తానని ఏ డువగా.. వచ్చి తీసుకువస్తాను రావద్దని బతిమిలాడానని.. ఇంతలోనే ఘోరం జరిగిందని  రోదిస్తూ చెప్పా రు. స్పందించడం లేదంటూ పోలీసులతో మృతురాలి కుటుంబీకులు, బంధువులు వాగ్వాదానికి దిగారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement