ఇన్‌ఫార్మర్‌ నెపంతో సబ్‌ కాంట్రాక్టర్‌ హత్య | Maoists murder suspected police informer in Odisha | Sakshi
Sakshi News home page

ఇన్‌ఫార్మర్‌ నెపంతో సబ్‌ కాంట్రాక్టర్‌ హత్య

Apr 26 2018 4:51 AM | Updated on Oct 9 2018 2:53 PM

Maoists murder suspected police informer in Odisha - Sakshi

చర్ల: పోలీసు ఇన్‌ఫార్మర్‌ నెపంతో మావోయిస్టులు ఓ సబ్‌ కాంట్రాక్టర్‌ను దారుణంగా హతమార్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా కొవ్వకొండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. కొవ్వకొండ ఠాణా పరిధిలోని గడిమిరికి చెందిన రాజు.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ కాంట్రాక్టర్‌ వద్ద సబ్‌ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతను పనులు చేసే ప్రాంతానికి దంతెవాడ జిల్లా కేంద్రానికి నిత్యం రాకపోకలు సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అతడిని మావోయిస్టులు ఇన్‌ఫార్మర్‌గా భావిస్తూ బుధవారం తెల్లవారుజామున గడిమిరిలోని అతడి ఇంటి నుంచి తీసుకెళ్లి గ్రామ శివారులో దారుణంగా నరికి చంపారు. ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తుండటం వల్లే హతమార్చినట్లు మావోయిస్టులు లేఖను విడిచిపెళ్లారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement