బాలిక కిడ్నాప్‌ కలకలం  | Man Tried to Kidnap Girl in Moinabad | Sakshi
Sakshi News home page

బాలిక కిడ్నాప్‌ కలకలం 

Jul 18 2019 1:16 PM | Updated on Jul 18 2019 1:16 PM

Man Tried to Kidnap Girl in Moinabad - Sakshi

దుండగుడిని పోలీసులకు అప్పగిస్తున్న స్థానికులు

మొయినాబాద్‌(చేవెళ్ల): ‘మీ నానమ్మ దగ్గరకు తీసుకెళ్తాను’ అంటూ బాలికకు నమ్మించిన ఓ దుండగుడు కిడ్నాప్‌కు యత్నించాడు. స్కూటీపై తీసుకెళ్తుండగా చిన్నారిని గుర్తించిన ఓ వ్యక్తి అడ్డుకుని స్థానికులతో కలిసి నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన మొయినాబాద్‌ మండలం చిలుకూరులో బుధవారం తీవ్ర కలకలం రేపింది. ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని కార్వాన్‌ ప్రాంతానికి చెందిన సమృద్దీన్‌(45) బుధవారం ఉదయం 10 గంటల సమయంలో అదే ప్రాంతానికి చెందిన బాలిక(13)ను ‘మీ నానమ్మ వద్దకు తీసుకెళ్తాను’ అంటూ నమ్మబలికి తన స్కూటీపై ఎక్కించుకుని బయలుదేరాడు. మొయినాబాద్‌ మండలంలోని హిమాయత్‌నగర్‌–తంగడపల్లి రోడ్డులో స్కూటీపై వెళ్తుండగా.. కార్వాన్‌కు చెందిన నజీమ్‌ అనే వ్యక్తి పని నిమిత్తం చిలుకూరు గ్రామానికి ప్రయాణమయ్యాడు. ఈక్రమంలో చిలుకూరు మహిళా ప్రాంగణం వద్ద అతడు బాలికను గుర్తించాడు. ఆమెను ఎక్కడి తీసుకెళ్తున్నావంటూ నజీమ్‌ ప్రశ్నించగా దుండగుడు తప్పించుకోవడానికి స్కూటీ వేగం పెంచాడు. నజీమ్‌ వెంబడించి అతడిని పట్టుకున్నాడు. స్థానికులంతా గుమ్మికూడి నిలదీశారు. బాలికను అడిగి విషయం తెలుసుకున్న స్థానికులు అతనికి దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న మొయినాబాద్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో నిందితుడిని వారికి అప్పగించారు. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబీకులు ఠాణాకు రావడంతో వారికి ఆమెను అప్పగించారు. ఈమేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement