భర్తకు డబ్బు కావాలని భార్యకు ఫోన్‌

A Man Taken Money From Women on the Name of Her Husband - Sakshi

ఇరువురి నడుమ మాటలు లేకపోవడంతో మోసం

పలు దఫాలుగా రూ.3.20లక్షలు కాజేసిన ఆగంతకుడు

వరంగల్‌ క్రైం: భార్యాభర్తల నడుమ మాటలు లేవు.. భర్త దూరప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నాడు.. ఈ విషయం  తెలియడంతో తనకు అనువుగా మార్చుకుని డబ్బు కాజేశాడో ఆగంతకుడు. హన్మకొండ గోకుల్‌నగర్‌లో నివాసం ఉంటున్న శారదకు తన భర్తతో కొన్నేళ్లుగా మాటలు లేవు. ఆమె భర్త ఉద్యోగరీత్యా వేరే రాష్ట్రంలో ఉంటున్నాడు. దీనిని ఆసరాగా చేసుకున్న ఓ ఆగంతకుడు ఫోన్‌ చేసి ‘నీ భర్తకు డబ్బు అవసరం ఉందట.. ఆయన నీతో మాట్లాడడం లేదు కాబట్టి నాతో ఫోన్‌ చేయించాడు’ అని చెప్పేవాడు. దీంతో ఆయన మాటలు నమ్మిన శారద పలు దఫాలుగా ఆన్‌లైన్‌ ద్వారా రూ.3,20,800 పంపించింది. చివరకు అనుమానం వచ్చిన ఆమె నేరుగా తన భర్తకు ఫోన్‌ చేసి ఆరా తీయడంతో మోసం బయటపడింది. ఈ మేరకు సుబేదారి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top