ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య | man suicide due to finacial problems | Sakshi
Sakshi News home page

ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

Jul 27 2015 12:56 PM | Updated on Nov 6 2018 7:56 PM

ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

వేములవాడ (కరీంనగర్): ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం పోశెట్టిపల్లికి చెందిన గోపు తిరుపతి (40) ఆదివారం రాత్రి ఇంటి వెనుక వేప చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కాగా, తిరుపతికి, అతని భార్యకు మధ్య గొడవలు జరుగుతున్నట్టు సమాచారం. అప్పులు కూడా ఉండడంతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement