గోదావరిలో స్నానానికి వెళ్లిన ఓ అయ్యప్ప భక్తుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా మంగపేట మండలంలో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.
గోదావరిలో అయ్యప్పభక్తుడు గల్లంతు
Dec 24 2015 1:41 PM | Updated on Oct 9 2018 5:39 PM
మంగపేట: గోదావరిలో స్నానానికి వెళ్లిన ఓ అయ్యప్ప భక్తుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా మంగపేట మండలంలో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. మండలంలోని అకినేపల్లి మల్లారం గ్రామానికి చెందిన సెగ్గం సోమరాజు(22) అయ్యప్ప మాల ధరించాడు. గురువారం మధ్యాహ్నం గ్రామ సమీపంలోని గోదావరిలో స్నానం చేసేందుకు వెళ్లాడు. స్నానం చేస్తూ నీట మునిగాడు. కొంతసేపటి తర్వాత గమనించిన తోటి వారు అతడి కోసం వెదికినా జడ దొరకలేదు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈతగాళ్లను రప్పించి సోమరాజు కోసం గాలిస్తున్నారు.
Advertisement


