విషజ్వరంతో వ్యక్తి మృతి | Man dies of Fever | Sakshi
Sakshi News home page

విషజ్వరంతో వ్యక్తి మృతి

Aug 28 2015 4:48 PM | Updated on Jun 13 2018 8:02 PM

ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూరు మండలంలో విషజ్వరాలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి.

చెన్నూరు (ఆదిలాబాద్) : ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూరు మండలంలో విషజ్వరాలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. చెన్నూరు పట్టణంలోని లైన్‌గడ్డ ప్రాంతానికి చెందిన తగరం మల్లేష్(38) అనే వ్యక్తి సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన గత వారం రోజులుగా విషజ్వరంతో బాధపడుతున్నాడు.

కాగా స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. మండల పరిధిలో విషజ్వరాలు ప్రబలి జనాలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement