కుటుంబకలహాలతో మనస్తాపం చెందిన ఒక వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కుర్వీ(వరంగల్ జిల్లా) : కుటుంబకలహాలతో మనస్తాపం చెందిన ఒక వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన గురువారం వరంగల్ జిల్లా కుర్వీ మండలం బలపాల గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... బలపాల గ్రామానికి చెందిన చంద్రు(35) అనే వ్యక్తి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే గత కొంతకాలంగా ఇంట్లో కుటుంబకలహాలు చెలరేగుతున్నాయి. దీంతో మనస్తాపం చెందిన చంద్రు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.