సీఎంఆర్‌ఎఫ్‌కు మమత వైద్య విద్యా సంస్థ రూ.25 లక్షల విరాళం

Mamatha Medical College Donates To CM Relief Fund In Khammam - Sakshi

ఖమ్మం మయూరి సెంటర్‌: కరోనా వైరస్‌ నివారణ చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపు మేరకు మమత వైద్య విద్యా సంస్థ చైర్మన్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సీఎంఆర్‌ఎఫ్‌కు రూ.25 లక్షల విరాళం ఇవ్వనున్నట్లు ఆదివారం ప్రకటించారు. అలాగే మంత్రి పువ్వాడ పిలుపు మేరకు గత ఐదు రోజులుగా ఖమ్మంలోని పలువురు ప్రముఖులు, వ్యాపారులు, విద్యా సంస్థలు, ఆస్పత్రుల నిర్వాహకులు, వైద్యులు, కాంట్రాక్టర్లు ఇప్పటివరకు రూ.1.75 కోట్ల వరకు విరాళాలు అందజేశారు. వీటితోపాటు తాను ప్రకటించిన రూ.25 లక్షల విరాళంతో కలిపి మొత్తం రూ.2 కోట్లను సీఎం కేసీఆర్‌కు మంత్రి అజయ్‌కుమార్‌ అందజేయనున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top