తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌కు మాదిగలు అండగా ఉన్నారని, వారిపట్ల వ్యతిరేకతను వీడనాడి... ఎస్సీ వర్గీకరణ కోసం అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లే తేదీని ప్రకటించాలని...
తొర్రూరు : తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌కు మాదిగలు అండగా ఉన్నారని, వారిపట్ల వ్యతిరేకతను వీడనాడి... ఎస్సీ వర్గీకరణ కోసం అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లే తేదీని ప్రకటించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ కోరారు. తొర్రూరులో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో తీర్మానం చేయాడం కొత్తదేమీ కాదని, నిజంగా మాదిగల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హమీకి కట్టుబడి వర్గీకరణ సాధనకు సీఎం కృషి చేయాలన్నారు. ఈ బాధ్యత ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరిపై ఉందన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో సిద్ధిపేట సంఘటన, కేసీఆర్ ఆమరణ దీక్షకు అం డగా ఉన్నది ఎమ్మార్పీఎస్, మాదిగలు మాత్రమేనన్నారు. జీవితాంతం మాదిగలకు రుణపడి ఉండాల్సిన కేసీఆర్ మాదిగల సంక్షేమం, వర్గీకరణపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ స్పష్టత ఇవ్వకపోవడం సరికాదన్నారు. తమ సహకారంతో తెలం గాణలో పాదయాత్ర చేసిన, ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చి న టీడీపీ ఇచ్చిన మాట ను నిలబెట్టుకోకుంటే రెండు ప్రాంతాల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
తెలంగాణ టీడీపీ నేతలైన ఎర్రబెల్లి, రమణ.. మాదిగలకు అన్యాయం చేస్తున్న చంద్రబాబును ఒప్పించకుండా.. ఇతరులపై విమర్శలు చేసే నైతిక హక్కు లేదన్నారు. వర్గీకరణపై ఏపీలో తీర్మానం చేయకుంటే భవిష్యత్‌లో టీడీపీ, చంద్రబాబుతో తాడో పేడో తేల్చుకుం టామన్నారు. సమావేశంలో నకిరకంటి యాక య్య, మంద కుమార్, తిప్పారపు లక్ష్మణ్, తీగల ప్రదీప్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.