మాదిగలపై కేసీఆర్ వివక్ష | madiga On KCR discrimination | Sakshi
Sakshi News home page

మాదిగలపై కేసీఆర్ వివక్ష

Feb 9 2015 2:58 AM | Updated on Oct 8 2018 3:48 PM

మాదిగలపై కేసీఆర్ వివక్ష - Sakshi

మాదిగలపై కేసీఆర్ వివక్ష

ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిగ సామాజిక వర్గంపై కక్ష పూనారని, అందుకే రాజయ్యను మంత్రి వర్గం నుంచి బర్త్ చేసి పగ తీర్చుకున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘మీట్ ది ప్రెస్’లో మంద కృష్ట మాదిగ ఆరోపణ
పంజగుట్ట: ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిగ సామాజిక వర్గంపై కక్ష పూనారని, అందుకే రాజయ్యను మంత్రి వర్గం నుంచి బర్త్ చేసి పగ తీర్చుకున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి ఆరోపణల వల్ల ఓ మంత్రిని బర్త్రచేసే అధికారం ముఖ్యమంత్రికి ఉంటే కేసీఆర్ ప్రభుత్వంపై కూడా అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని, వెంటనే గవర్నర్ కేసీఆర్ ప్రభుత్వాన్ని బర్త్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో మీట్ ది ప్రెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంద కృష్ణ విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. మంత్రివర్గంలో ఉన్న కేటీఆర్, హరీశ్‌రావు, మహేందర్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డిపై కూడా పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయని, మరి వారినెందుకు ఉపేక్షిస్తున్నారని మంద కృష్ణ ప్రశ్నించారు.

కేవలం దళితుడైనందుకే రాజయ్యను తొలగించారన్నారు.  తెలంగాణ వ్యాప్తంగా మూడుసార్లు పర్యటించి, మండల కేంద్రాల్లో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో సైతం నిద్రించి, అక్కడి సమస్యలు తెలుసుకుంటూ మంచి పేరు సంపాదిస్తున్న రాజయ్యపై కక్షగట్టే మంత్రి వర్గం నుంచి తొలగించారన్నారు. ఇకపై కేసీఆర్‌ను వెంటాడుతాం, వే టాడుతామని, రాజకీయంగా పగతీర్చుకుంటామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక్క మహిళకు కూడా కేసీఆర్ మంత్రివర్గంలో అవకాశం ఇవ్వలేదని దుయ్యబట్టారు. సొంత ప్రాంతం వాడే మోసం చేస్తే ఆ ప్రాంతంలోనే పూడ్చేయాలన్న కాళోజీని ఆదర్శంగా తీసుకొని కే సీఆర్‌పై మరో ఉద్యమం ప్రారంభిస్తామని హెచ్చరించారు.

ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 15 వరకు రాజయ్య బర్త్ఫ్, మంత్రి వర్గంలో 50 శాతం మహిళలకు ఇవ్వాలనే డిమాండ్‌తో జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. 16 నుంచి ఏప్రిల్ 3 వరకు అన్ని మండల కేంద్రాల్లో దండయాత్ర, ఏప్రిల్ 4న లక్షలాది మందితో ఇందిరాపార్కు నుంచి కేసీఆర్ ఇంటి వరకు దండయాత్ర చేపడతామని చెప్పారు. మార్చి 7న జిల్లా కేంద్రాల్లో, 8న మండల కేంద్రాల్లో ధర్నలు కొనసాగుతాయని చెప్పారు.  ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ అధ్యక్షుడు కాసాని శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సుదర్శన్, రవికాంత్, షాబుద్దీన్, మహేష్, సత్యం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement