
బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల సవాల్ అప్‌డేట్స్..
మహబూబాబాద్:
ఒక పెద్ద మనిషి హైదరాబాదు లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి వచ్చి సవాళ్లు చేస్తున్నారు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- ముఖ్యమంత్రి చెప్పింది ఏంటి...! నీకు అర్ధం అయ్యింది ఏంటి..!
- ముఖ్యమంత్రి.. మాజీ ముఖ్యమంత్రిని రమ్మని సవాల్ విసిరితే ఆయన్ను రానివ్వడం లేదు
- CM సవాల్ ను జీర్ణించుకోలేక పోతున్నారు.
- ప్రజల పట్ల ఏ మాత్రం బాధ్యత.. నిబద్ధత ఉన్నా మాజీ ముఖ్యమంత్రి శాసనసభకు రండి. మేం కూడా లెక్కలతో సహా వస్తాం
- శాసనసభలో తేల్చుకుందాం.
కేటీఆర్‌కు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కౌంటర్..
- కేటీఆర్ నీకు దమ్ముంటే కేసీఆర్‌ను అసెంబ్లీకి తీసుకురా..
- దళిత ముఖ్యమంత్రి ఏమైందో ఎందుకు చెప్పడం లేదు..
- కేసీఆర్‌ను తొక్కి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు..
- రేవంత్ రెడ్డి దమ్ము ఏంటో కేసీఆర్‌ను అడుగు కేటీఆర్..
- కేటీఆర్ ఓక బచ్చా..
- వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలా ఉండాలో కనీసం అవగాహన లేని నేత కేటీఆర్.
- కేటీఆర్ అహాంకారం అంతా లక్ష కోట్ల దోపిడీతో వచ్చింది.
- సాగరహారంలో మీరెక్కడ ఉన్నారు కేటీఆర్...
- దోచుకుంటరు.. జై తెలంగాణ అంటరు..
- బీఆర్ఎస్ ప్రభుత్వంలో కోదండరాం, మందకృష్ణ మాదిగ లాంటి ఉద్యమకారులను అర్ధరాత్రి అరెస్ట్ చేశారు.
- దోపిడీ చేసిన మిమ్మల్ని అరెస్ట్ చేస్తే తప్పేంటి?.
- కల్వకుంట్ల కుటుంబంలో రన్నింగ్ రేస్ నడుస్తోంది.
- బీఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్ చేయకపోతే కాంగ్రెస్‌కు వంద సీట్లు వచ్చేవి.
- రేవంత్ రెడ్డితో చర్చించే స్థాయి కేసీఆర్, కేటీఆర్‌ది కాదు.
సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో కేటీఆర్ కామెంట్స్..
- ముఖ్యమంత్రికి బేసిక్ నాలెడ్జ్ లేదు.
- 18 నెలలుగా రైతులను మోసం చేశారు.
- ఒక్క హామీ కూడా నిలబెట్టుకోకుండా రంకెలేస్తున్నారు.
- రేవంత్‌కు రచ్చ చేయడం తప్ప.. చర్చ చేయడం రాదు.
- రేవంత్ సవాల్‌ను స్వీకరిస్తే చర్చకు ఆయన రాలేదు.
- రేవంత్ మాట తప్పుతారని తెలిసినా సవాల్‌ను స్వీకరించాం.
- సీఎం కాకపోయినా మంత్రి అయినా వస్తారని అనుకున్నాం.
- తెలంగాణ నిధులు ఢిల్లీకి పారిపోతున్నాయి.
- రైతులపై సీఎం రేవంత్ రెడ్డి గౌరవం లేదు.
- ఢిల్లీకి సీఎం ఎందుకు వెళ్లారని అడిగితే ఎరువుల కోసం అని చెబుతున్నారు.
- రైతుబంధు అందరికీ ఇచ్చేశామని చెప్పుకుంటున్నారు.
- కొడంగల్‌లో ఎంత మంది రైతులకు రైతుబంధు పడలేదో లిస్ట్ రెడీగా ఉంది.
- రైతుల మరణాల లిస్ట్ కూడా తీసుకొచ్చాం.
- ఆనాటి ఎమర్జెన్సీ పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తోంది.
- ఇప్పటికైనా మరోసారి సవాల్ చేస్తున్నా.
- రేవంత్‌తో చర్చకు సిద్ధం.. ప్లేస్ ఎక్కడో డిసైడ్ చేయాలని సవాల్ చేస్తున్నా.
- డేట్ కూడా మీరే ఫిక్స్ చేయండి.. ఎక్కడి రమ్మంటే అక్కడి వస్తాం.
- చర్చ కోసం రేవంత్ ఇంటికి రమ్మనా వెళ్తాం.
- రేవంత్ స్థాయికి కేసీఆర్ అవసరం లేదు.. మేము చాలు.
- మీకు నిజాయితీ ఉంటే చర్చకు రండి.
- లేదంటే క్షమాపణ చెప్పాలి.
- రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి కేసీఆర్‌కు క్షమాపణ చెప్పాలీ కేటీఆర్
- చర్చకు వచ్చే సత్తా లేనప్పుడు.. రేవంత్ రెడ్డి మరోసారి సవాల్ చేయొద్దు
- రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళింది యూరియా బస్తాల కోసం కాదు
- ఏ బస్తాలు మోసి రేవంత్ ముఖ్యమంత్రి పదవి కాపాడుకుంటున్నారో అందరికీ తెలుసు
- రేవంత్ రెడ్డికి రచ్చ చేయటమే తెలుసు. చర్చ చేయటం రాదు
- ఏ బేసిన్ ఎక్కడుందో తెలియని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- రేవంత్ హాయాంలో నీళ్ళు ఆంధ్రకు.. నిధులు ఢిల్లీకి.. నియామకాలు రేవంత్ తొత్తులకు
- గురువు చంద్రబాబు కోసం తెలంగాణ నీళ్ళను ఆంధ్రకు పంపుతున్నారు
- నాలుగు రోజులు మోసాలు చేసి రేవంత్ తప్పించుకోవచ్చు. ప్రజలు క్షమించరు
- సవాల్ విసిరి మాట తప్పటం సీఎం రేవంత్ రెడ్డికి అలవాటు
- 2018లో కొండగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాట తప్పాడు
అసెంబ్లీకి కాంగ్రెస్ నేతలు..
- అసెంబ్లీకి చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
- అసెంబ్లీ వేదికగానే సంక్షేమంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం.
- అసెంబ్లీకి రమ్మంటే బీఆర్‌ఎస్ నేతలు పారిపోతున్నారు.
- సభ పెట్టేందుకు కేసీఆర్‌తో లేఖ రాయించండి.
- 9 రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయల రైతు భరోసా ఇచ్చాం.
- బీఆర్‌ఎస్ మాటలపై చర్చ పెడదాం.
ప్రెస్‌క్లబ్‌కు కేటీఆర్
ప్రెస్‌క్లబ్‌కు చేరుకున్న కేటీఆర్
ప్రెస్‌క్లబ్ వద్దకు భారీగా తరలివచ్చిన బీఆర్‌ఎస్ శ్రేణులు.
ప్రెస్‌కబ్ల్‌లో సీఎం రేవంత్‌కు కుర్చీ వేసిన కేటీఆర్.
తెలంగాణ భవన్ నుంచి ప్రెస్‌క్లబ్‌కు బయలుదేరిన కేటీఆర్
భారీ కాన్వాయ్‌తో ప్రెస్‌క్లబ్‌కు కేటీఆర్.
ప్రెస్‌క్లబ్ వద్ద టెన్షన్ టెన్షన్..
కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ సవాల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. బహిరంగ చర్చకు రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఈరోజు ఉదయం 11 గంటలకు సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌కు చేరుకోనున్నారు. ఇక, ఇప్పటికే సోమాజీగూడ ప్రెస్‌క్లబ్ వద్దకు బీఆర్‌ఎస్ నేతలు చేరుకుంటున్నారు. దీంతో, ప్రెస్‌క్లబ్ ఎదుట భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరోవైపు.. తెలంగాణ భవన్ వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రైతు సంక్షేమంపై చర్చకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ సవాల్ చేశారు. రేవంత్ సవాల్‌ను స్వీకరిస్తున్నాం. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నేతలు మర్చిపోయారు. హామీలు అమలు చేయాలని 18 నెలలుగా కోరుతున్నాం. అడ్డగోలు హామీలతో రైతులతో పాటు అందరినీ మోసం చేశారు. అసెంబ్లీలో చర్చ పెట్టరు.. పెట్టినా మాకు మైక్ ఇవ్వరు. దమ్ముంటే చర్చకు రావాలని రేవంత్ సవాల్ విసిరారు. రేవంత్ సవాల్‌ను స్వీకరించి ప్రెస్‌క్లబ్‌కు వెళ్తున్నాను. రేవంత్ ఢిల్లీలో ఉన్నారు కాబట్టి మంత్రులు అయిన వస్తారేమో చేస్తాం. మంత్రులతోనైనా మేం చర్చలకు సిద్దం అని అన్నారు.