తాళి కట్టి.. తప్పుకున్నాడు | Lover Cheated By Girl Worry Karimnagar | Sakshi
Sakshi News home page

తాళి కట్టి.. తప్పుకున్నాడు

Jan 26 2019 8:55 AM | Updated on Jan 26 2019 8:57 AM

Lover Cheated By Girl  Worry Karimnagar - Sakshi

కోరుట్ల (కరీంనగర్‌) : ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి.. తప్పుకుని మళ్లీ దొంగచాటుగా పెళ్లి చేసుకుని పరారైన ప్రియుడి ఇంటి ముందు కోరుట్ల పట్టణానికి చెందిన ఓ యువతి ఆందోళన చేసింది. బాధితురాలు వెల్లడించిన వివరాలు ప్రకారం.. పట్టణంలోని అంబేద్కర్‌ నగర్‌లో నివాసముండే పసుల శ్రీకాంత్‌(26) అదే ఏరియాలో ఉండే మంద రవళి(23)ని ఐదేళ్లుగా ప్రేమిస్తున్నాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి లోబర్చుకుని, తరువాత మొహం చాటేయడంతో మరొకరితో వివాహానికి రవళి సిద్ధమైంది.

ఆ సమయంలో పెళ్లికొడుకును బెదిరించి మళ్లీ రవళిని వివాహం చేసుకుంటానని చెప్పి దొంగచాటుగా తాళికట్టాడు. ఆ తరువాత రవళి అత్తగారింటికి వెళితే వారు బెదిరించడంతో పాటు శ్రీకాంత్‌తో సహా కుటుంబ సభ్యులందరూ ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీంతో బాధితురాలు శుక్రవారం మహిళా జాగృతి పట్టణాధ్యక్షురాలు మధురిమ అధ్వర్యంలో తన అత్తాగారింటి ముందు ఆందోళన చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement