ఫిన్లాండ్‌ వధువు..వేములవాడ వరుడు | love marriage in vemulawada | Sakshi
Sakshi News home page

ఫిన్లాండ్‌ వధువు..వేములవాడ వరుడు

Feb 27 2017 6:16 PM | Updated on Sep 5 2017 4:46 AM

కృష్ణప్రసాద్‌, జొహన్నా స్థానిక రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు

వేములవాడ:  ప్రేమకు హద్దులు ఉండవంటారు నిజమే వీరి ప్రేమకు దేశాలు హద్దు కాలేదు. ఫిన్లాండ్‌ ఎక్కడ..వేములవాడ ఎక్కడ..?అయినా ఈ జంట, సోమవారం ఉదయం కృష్ణప్రసాద్‌, జొహన్నా స్థానిక రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. పట్టణం యువకుడు, ఫిన్లాండ్‌కు చెందిన యువతి దంపతులయ్యారు.  సీహెచ్‌ కృష్ణప్రసాద్‌ మూర్తి ఉన్నత చదువుల కోసం నాలుగేళ్ల క్రితం ఫిన్లాండ్‌ దేశానికి వెళ్లాడు. 
 
అతడు చదువుతున్న యూనివర్సిటీలోనే అక్కడి టామ్‌సెరె నగరానికి చెందిన సరినెన్‌ జొహన్నా చదువుకుంటోంది. వారిద్దరి మధ్య మొదలైన పరిచయం ప్రేమగా మారింది. రెండు కుటుంబాల వారు పెళ్లికి కూడా అంగీకరించడంతో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement