ప్రేమజంట ఆత్మహత్య | Love couple suicide in siddipet | Sakshi
Sakshi News home page

ప్రేమజంట ఆత్మహత్య

May 17 2019 12:55 AM | Updated on May 17 2019 12:55 AM

Love couple suicide in siddipet - Sakshi

కొండపాక (గజ్వేల్‌): పెళ్లి విషయంలో పెద్దలను ఎదిరించే ధైర్యం లేక ఓ ప్రేమజంట వారు చదువుకున్న పాఠశాలలోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం సిద్దిపేట జిల్లా కొండపాక మం డలంలోని లకుడారం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. లకుడారం గ్రామానికి చెందిన మంజ మల్లయ్య–నర్సవ్వల రెండో కుమారుడు కనకయ్య (21), రాచకొండ మడేలు–రేణుకల రెండో కుమార్తె తార (19)లు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ చిన్నప్పటి నుంచి క్లాస్‌మేట్స్‌. వేర్వేరు సామాజికవర్గాలకు చెందిన వీరు ప్రేమించుకుంటున్న విషయం రెండేళ్ల కిందట తెలియడంతో తార కుటుంబీకులు కనకయ్యపై దాడి చేసి పంచాయితీ పెట్టి అప్పట్లో రూ.30 వేల వరకు జరిమానా వేశారు.

ఇద్దరూ కలుసుకోరాదని, మాట్లాడుకోరాదని మందలించారు. అయినప్పటికీ వారు ప్రేమాయ ణాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఇద్దర్నీ కలవనీయరని భావించిన వారు బుధవారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిపోయారు. రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో ఇరు కుటుంబాలు వెతకడం మొదలు పెట్టారు. గ్రామానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో రాజీవ్‌ రహదారికి సమీ పంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని ఓ తర గతి గదిలో వీరు ముందుగా పురుగుల మందు తాగి తర్వాత ఉరేసుకున్నారు. అటుగా వెళ్తున్న గ్రామస్తులు ఉరేసుకున్న విషయాన్ని గమనించారు. దీంతో గ్రామంలో విషయం చెప్పడంతో మృతుల కుటుంబీకులు ఘటనాస్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుల కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కుకునూరుపల్లి ఎస్సై పరమేశ్వర్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement