ఔటర్‌పై లారీ దగ్ధం | lorry crash on at outer ring road | Sakshi
Sakshi News home page

ఔటర్‌పై లారీ దగ్ధం

Oct 13 2015 1:44 PM | Updated on Sep 5 2018 9:45 PM

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పెద్ద గోల్కొండ సమీపంలో ఔటర్ రింగురోడ్డుపై మంగళవారం మధ్యాహ్నం ఒక లారీ బోల్తా పడింది.

శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పెద్ద గోల్కొండ సమీపంలో ఔటర్ రింగురోడ్డుపై మంగళవారం మధ్యాహ్నం ఒక లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీకి మంటలు అంటుకుని పూర్తిగా కాలిపోయింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న ఇసుక లారీ శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ ఔటర్ రింగు రోడ్డు వద్దకు రాగానే అదుపు తప్పి వైడర్‌ను ఢీకొట్టింది. అప్రమత్తమైన లారీ డ్రైవర్, క్లీనర్ కిందికి దూకేశారు. అనంతరం లారీ రింగు రోడ్డుపై నుంచి దాదాపు 30 అడుగుల కిందికి పడిపోయింది. దీంతో ఒక్కసారిగా మంటలు లేచి పూర్తిగా కాలిపోయింది. సంఘటన స్థలం నుంచి  లారీ డ్రైవర్, క్లీనర్ పరారయ్యారు.
 

Advertisement
 
Advertisement
Advertisement