నల్లగొండ జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి చెందారు. చిట్యాల శివారులో రోడ్డు క్రాస్ చేస్తున్న బైక్ను వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది.
చిట్యాల: నల్లగొండ జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి చెందారు. చిట్యాల శివారులో రోడ్డు క్రాస్ చేస్తున్న బైక్ను వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన రాజశేఖర్(30) అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించనున్నారు.