నగరంలోని చింతల్‌గుంట చెక్‌పోస్ట్ వద్ద లారీ బీభత్సం సృష్టించింది.
సాక్షి, హైదరాబాద్: నగరంలోని చింతల్‌గుంట చెక్‌పోస్ట్ వద్ద మంగళవారం ఓ లారీ బీభత్సం సృష్టించింది. లోడ్‌తో వెళ్తున్న లారీ చెక్‌పోస్టు వద్ద మరో వాహనాన్ని తప్పించబోయి ఆటోను ఢీకొట్టింది. అనంతరం అదుపుతప్పిన లారీ పక్కనే ఉన్న గుడిసెలోకి దూసుకెళ్లింది. గుడిసెలో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఆటో, కారు ధ్వంసమయ్యాయి.