లాక్‌డైన్‌: క్వారంటైన్‌.. డాల్గొనా కాఫీ | Lockdown: Dalgona Coffee Famous In Quarantine Time At Home | Sakshi
Sakshi News home page

లాక్‌డైన్‌: క్వారంటైన్‌.. డాల్గొనా కాఫీ

Apr 13 2020 9:10 AM | Updated on Apr 13 2020 9:11 AM

Lockdown: Dalgona Coffee Famous In Quarantine Time At Home - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ టైమ్‌లో సోషల్‌ మీడియాలో కొత్త కొత్త ట్రెండ్స్‌ అప్‌లోడ్‌ అవుతున్నాయి. వీటిలో అత్యధికమైన పోస్ట్స్‌ ఫుడ్‌ గురించే ఉంటున్నాయి. ఎక్కువ టైమ్‌ ఇంట్లో ఉండటంతో ఇప్పటిదాకా మర్చిపోయిన పాకశాస్త్రాన్ని ఒక్కసారిగా గుర్తు తెచ్చుకుంటున్నారు కొందరు. మరికొందరేమో.. హోటల్స్, రెస్టారెంట్‌ ఫుడ్‌కి అలవాటైన జిహ్వను అణుచుకోలేక  తమకు తామే స్వయంగా కొత్త వంటల్ని ట్రై చేస్తున్నారు. ఇదే క్రమంలో సిటీజనులకు ఇప్పుడు క్రేజీగా మారింది డాల్గొనా. 

దక్షిణ కొరియాలోని స్పాంజీ టాఫీ నుంచి స్ఫూర్తి పొందిన ఈ డాల్గొనా కాఫీ... ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. మూడు రకాల ముడి దినుసులతో తయారయ్యే ఈ కాఫీ ఇప్పుడు సిటీలో పలువురి ఇళ్లలోనూ ఘమఘమలు పంచుతోంది.  

నేపథ్యమిదీ..
దక్షిణ కొరియా కాఫీ కల్చర్‌కు బాగా ఫేమస్‌. సాధారణ ముందస్తుగా కలిపిన ప్రీ మిక్సడ్‌ కాఫీ నుంచి ఆర్టిస్టిక్‌ క్యులినరీ విశేషాలు కలగలిసిన కాఫీలకూ అక్కడ డిమాండ్‌ ఎక్కువే. అచ్చం అక్కడిలానే నగరంలోనూ  యువత సోషలైజింగ్‌కు ఎక్కువగా కాఫీషాప్‌లే ఎంచుకుంటారనేది తెలిసిందే. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కాఫీషాప్‌ ముఖం చూసి కూడా ఎన్నో ఏళ్లు గడిచినట్టయ్యిందని అంటున్నారు నగరవాసులు. ఈ పరిస్థితుల నుంచే పుట్టుకొచ్చింది సింపుల్‌ హోమ్‌ మేడ్‌ కాఫీ డాల్గొనా. దీన్నిప్పుడు క్వారంటైన్‌ కాఫీ అని నెటిజన్లు పిలుస్తున్నారు. దీని తాలూకు రిసిపీ, ఫొటోలు, యూట్యూబ్, ఇన్‌స్ట్రాగామ్, టిక్‌టాక్‌లలో సందడి చేస్తున్నాయి. కేవలం మూడు ముడి దినుసులతో సులభంగా తయారు చేసుకోగలగడంతో ఇప్పుడది క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ సహా పలువురికి క్వారంటైన్‌ ఫేవరెట్‌గా మారిపోయింది. 

మేడ్‌ ఈజీ.. టేస్ట్‌ క్రేజీ.. 
ఓ రెండు టేబుల్‌ స్పూన్ల కాఫీ పౌడర్, 2 టేబుల్‌ స్పూన్ల పంచదార, 2 టేబుల్‌ స్పూన్ల హాట్‌ వాటర్, 2 కప్పుల బాయిల్డ్, కూల్డ్, చిల్డ్‌ మిల్క్‌, కొన్ని ఐస్‌ క్యూబ్స్‌లను సిద్ధం చేసుకోవాలి. బౌల్‌లో కాఫీ పౌడర్‌ వేసి పంచదార, హాట్‌ వాటర్‌ దానికి కలపాలి. బాగా అంటే నురుగ లాగ చిక్కగా అయ్యేవరకూ (సుమారుగా 10 నిమిషాల వరకూ) కలుపుతూనే ఉండాలి. ఆ తర్వాత ఫ్రిజ్‌లో నుంచి తీసిన చిల్డ్‌ మిల్క్‌ గ్లాసులో పోసుకోవాలి. తయారు చేసుకున్న నురగని గ్లాసుకు పైన తేలేలా పోయాలి. ఫ్లేవర్‌ పాలలో కలవడానికి ఓ మూల నుంచి ఒక్కసారి మాత్రం తేలికపాటి డిప్‌ చేయాలి. సర్వ్‌ చేసేటప్పుడు ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్లు జెమ్స్, చాకో చిప్స్, చాక్లెట్‌ సిరప్‌.. వంటివి టాపింగ్స్‌గా వేసుకోవచ్చు.

కాఫీ.. కుక్‌.. 
చాలా మంది సెలబ్రిటీలు డాల్గొనా సేవించడం చూశాను. నాకు పెద్దగా వంట రాదు. అయితే ఈ కాఫీ చాలా క్విక్‌గా,  సులభంగా తయారు చేసుకోవచ్చనేది ఇన్‌స్ట్రాగామ్‌ ద్వారా కొందరు చేస్తున్నప్పుడు అర్థమైంది. దాంతో నేనూ  ప్రయతి్నద్దామని అనుకున్నా. రిసిపి గురించి తెలుసుకుని తయారు చేశా. జెమ్స్, చాకో చిప్స్‌తో దానిని అలంకరించా. కోల్డ్‌ కాఫీ తాగకుండా నేనెప్పుడూ ఏ రెస్టారెంట్‌ కాఫీ షాప్‌ని దాటింది లేదు. దీంతో కోల్డ్‌ కాఫీ దొరక్క ప్రాణం గిలగిల్లాడిపోతోంది. సో.. నా కొత్త క్వారంటైన్‌ పార్ట్‌నర్‌గా ఇది మారిపోయింది.  – వర్షిత లక్ష్మి, శ్రీనగర్‌కాలనీ 

మంచి రిఫ్రెష్‌మెంట్‌.. 
ఈజీగా తయారు చేసుకోగలగడమే డాల్గొనా క్రేజ్‌కి కారణం అనిపిస్తుంది. ఒక కాఫీ తయారు చేసేయగలిగామనే కాఫీ మాస్టర్‌లాంటి ఫీల్‌.. కాఫీ టేస్ట్‌కి తోడవుతుంది. ఈ డాల్గొనాకి క్యారామెల్, చాక్లెట్, సాస్‌ వంటివి కూడా జోడించుకోవచ్చు. సమ్మర్‌లో మంచి రిఫ్రెష్‌మెంట్‌గా దీన్ని చెప్పొచ్చు. తయారు చేయడం మంచి ఫన్‌ కూడా.  – నేహ  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement