
సాక్షి, హైదరాబాద్: నేటి నుంచి 28 వరకు మూడ్రోజుల పాటు జరిగే సాహిత్యోత్సవాలు బేగంపేట్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకల్లో పలు సాహిత్య, సామాజిక అంశాలపై 30కి పైగా సదస్సులు, సాంస్కృతిక, చర్చా కార్యక్రమాలు, వర్క్‌షాపులు, ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ వేడుకలకు స్పెయిన్ అతిథి దేశంగా పాల్గొననుండటంతో పాటుగా 15కు పైగా రాష్ట్రాలు, 10 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారు.