చర్మ పరిశ్రమ అభివృద్ధికి 'లిప్కో' | 'LIPCO' for Leather Industries Develolpment | Sakshi
Sakshi News home page

చర్మ పరిశ్రమ అభివృద్ధికి 'లిప్కో'

Aug 27 2015 8:19 PM | Updated on Sep 3 2017 8:14 AM

రాష్ట్ర పునర్విభజన చట్టం-2014 నిబంధనల మేరకు ఆంధ్రప్రదేశ్ చర్మ పరిశ్రమాభివృద్ధి సంస్థ (లిడ్‌క్యాప్) నుంచి తెలంగాణ విభాగాన్ని వేరు చేస్తూ నూతన సంస్థను ఏర్పాటు చేశారు.

హైదరాబాద్ : రాష్ట్ర పునర్విభజన చట్టం-2014 నిబంధనల మేరకు ఆంధ్రప్రదేశ్ చర్మ పరిశ్రమాభివృద్ధి సంస్థ (లిడ్‌క్యాప్) నుంచి తెలంగాణ విభాగాన్ని వేరు చేస్తూ నూతన సంస్థను ఏర్పాటు చేశారు. కంపెనీల చట్టం-2013 నిబంధనల ప్రకారం నూతన సంస్థకు తెలంగాణ స్టేట్ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పోరేషన్ లిమిటెడ్ (లిప్కో) పేరిట నూతన సంస్థ ఆవిర్భవించింది. చేనేత సహకార సంస్థ ఆప్కో తరహాలో నూతన సంస్థకు 'లిప్కో' పేరిట సంక్షిప్త నామకరణం చేశారు. గోల్కొండ సమీపంలోని హుస్సేనీ షావలీలో లిప్కో కార్యాలయం ఏర్పాటు చేసినట్లు పరిశ్రమల శాఖ డిప్యూటీ కార్యదర్శి వి.సైదా గురువారం వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement