పెద్దగట్టు జాతరకు రూ. 2.10 కోట్లు విడుదల | Larger rehabilitation of Rs. 2.10 crore released | Sakshi
Sakshi News home page

పెద్దగట్టు జాతరకు రూ. 2.10 కోట్లు విడుదల

Dec 20 2014 2:34 AM | Updated on Sep 5 2018 1:47 PM

నల్లగొండ జిల్లా సూర్యాపేట నియోజకవర్గంలోని దూరజ్‌పల్లిలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించనున్న పెద్దగట్టు జాతర కోసం తెలంగాణ...

సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా సూర్యాపేట నియోజకవర్గంలోని దూరజ్‌పల్లిలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించనున్న పెద్దగట్టు జాతర కోసం తెలంగాణ ప్రభుత్వం రూ. 2.10 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మంచినీటి వసతి, పారిశుద్ధ్యం, ఆలయ ముస్తాబు, రహదారులు, విద్యుదీకరణ ఇతర సదుపాయాల కల్పనకు ఈ నిధులను ఖర్చు చేస్తారు. దేవాదాయ, గ్రామీణ నీటిసరఫరా, పంచాయతీరాజ్, ట్రాన్స్‌కో అధికారులు సమన్వయంతో పని చేసి జాతరను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement