కేజీతండా వాసికి అరుదైన అవకాశం

Lakavath Balaji Appointment As Assistant Professor At University Of Manchester - Sakshi

లండన్‌లోని మాన్‌చెస్టర్‌ వర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా నియామకం

జఫర్‌గఢ్‌: జనగామ జిల్లా జఫర్‌గఢ్‌ మండలం రేగడి తండా శివారు ఖాజనగండి (కేజీ తండా)కు చెందిన లకావత్‌ బాలాజీకి లండన్‌లోని మాన్‌చెస్టర్‌ యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేసే అరుదైన అవకాశం లభించింది. మిట్యనాయక్, సత్తమ్మ దంపతుల నాలుగో కుమారుడు బాలాజి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చిన్నతనం నుంచే చదువుపై ఆసక్తి పెంచుకున్నాడు. ప్రాథమిక విద్యను జఫర్‌గఢ్‌లో, అలాగే 8, 9, 10వ తరగతులను ఆలేరులోని ఎస్టీ హాస్టల్‌ ఉండి పూర్తి చేశాడు.

పదో తరగతిలో స్కూల్‌ ఫస్ట్‌ సాధించి హైదరాబాద్‌లోని అరబిందో జూనియర్‌ కళాశాలలో ఉచిత ప్రవేశం పొందాడు. ఇంటర్‌ అనంతరం హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఐదేళ్ల పాటు ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్‌సీ పూర్తి చేశాడు. తర్వాత లండన్‌లోని కార్డి యూనివర్సిటీలో పీహెచ్‌డీ పూర్తయిన తర్వాత మాన్‌చెస్టర్‌ యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఉద్యోగం సాధించాడు. మారుమూల ప్రాంతానికి చెందిన బాలాజీ లండన్‌ యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఉద్యోగం సాధించడంపై కుటుంబ సభ్యులతో పాటు తండావాసులు హర్షం వ్యక్తం చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top