బేగంపేటలో యువతి వీరంగం! | lady rash driving in Begumpet video goes viral | Sakshi
Sakshi News home page

బేగంపేటలో యువతి వీరంగం!

Oct 26 2017 3:14 PM | Updated on Oct 26 2017 3:57 PM

lady rash driving in Begumpet video goes viral

సాక్షి, హైదరాబాద్‌ :  నగరంలోని బేగంపేటలో ఓ యువతి హల్‌చల్‌ చేసింది. రద్దీగా ఉన్న రోడ్డుపై తన కారుతో ఇష్టానుసారంగా డ్రైవింగ్‌ చేసుకుంటూ వాహనదారుల పైకి దూసుకెళ్లగా.. క్షణాల్లో అప్రమత్తమైన నలుగురైదు వాహనదారులు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.  ర్యాష్ డ్రైవింగ్ పై ప్రశ్నించినందుకు ఓ సిగ్నల్ వద్ద ట్రాఫిక్ పోలీసుల ఎదుటే యువతి వీరంగం చేసింది. తనను ప్రశ్నించిన వాహనదారులను బూతులు తిట్టడంతో పాటు వారిపై దాడికి పాల్పడింది.

అక్కడే ఉన్న ఓ వాహనదారుడు యువతి చర్యలను వీడియో తీయడంతో విషయం బయటకు వచ్చింది. హౌ డేర్ యూ అంటూ ఓ వాహనదారుడిపై ట్రాఫిక్ పోలీసు ఎదుటే దాడి చేసిన వీడియో వైరల్‌గా మారింది. ట్రాఫిక్ పోలీసు సర్దిచెబుతున్నా.. ఆగ్రహంగా తనను అడ్డుకుని ప్రశ్నించిన వారిపై ఇష్టారీతిన నోరు పారేసుకుంటూ వెళ్లి తన కారు ఎక్కింది. అక్కడి నుంచి యువతి సైనిక్ పురి వైపుగా వెళ్లినట్లు సమాచారం. ఆ యువతి ఎవరు.. ఆమె మద్యం సేవించి వాహనం నడిపిందా అనే వివరాలు తెలియాల్సి ఉంది. యువతిపై ఫిర్యాదు చేస్తే పోలీసులు చర్యలు తీసుకుంటామన్నారు.

ర్యాష్ డ్రైవింగ్ చేసి.. ఆపై పోలీసు ఎదుటే వీరంగం 

Advertisement
 
Advertisement
Advertisement