ప్రమాదవశాత్తు కార్మికుడి మృతి | labour dies in adilabad district | Sakshi
Sakshi News home page

ప్రమాదవశాత్తు కార్మికుడి మృతి

Jul 8 2015 7:37 PM | Updated on Aug 17 2018 2:53 PM

ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్‌లోని సింగరేణి గనిలో బుధవారం ప్రమాదవశాత్తు ఓ కార్మికుడు చనిపోయాడు.

శ్రీరాంపూర్ (ఆదిలాబాద్): ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్‌లోని సింగరేణి గనిలో బుధవారం ప్రమాదవశాత్తు ఓ కార్మికుడు చనిపోయాడు. వివరాలు.. శ్రీరాంపూర్ పట్టణానికి చెందిన ఇరుపు రాఘవులు (39) గనిలోకి మ్యాన్‌హ్యాండ్లింగ్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు అదుపుతప్పి పడిపోయాడు.

సున్నితమైన ప్రాంతాల్లో బలమైన గాయాలు కావటంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. అయితే, ఆయన కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని కార్మికులంతా మెరుపు సమ్మెకు దిగారు. అధికారులు ఇచ్చిన హామీ మేరకు కొద్దిసేపటి తర్వాత ఆందోళన విరమించి, విధుల్లోకి చేరారు.

Advertisement
 
Advertisement
Advertisement