నేడు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో సీఎం పర్యటన | CM Revanth Reddy visit to Adilabad District on April 6th | Sakshi
Sakshi News home page

నేడు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో సీఎం పర్యటన

Apr 6 2026 12:47 AM | Updated on Apr 6 2026 12:47 AM

CM Revanth Reddy visit to Adilabad District on April 6th

మొదట బాసరలో రూ.225 కోట్ల పనులకు శంకుస్థాపన 

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు  

భైంసా/బాసర/కైలాస్‌నగర్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పర్యటించనున్నారు. మొదట ఆయన బాసర శ్రీజ్ఞాన సరస్వతి ఆలయానికి రానున్నారు. ఈ నేపథ్యంలో నిర్మల్‌ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సీఎం పర్యటనను విజయవంతం చేయడానికి అన్నిశాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేసినట్లు నిర్మల్‌ కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ తెలిపారు. బాసర మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా రూ.225 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. తర్వాత మధ్యాహ్నం ఆదిలాబాద్‌ జిల్లా బజార్‌హత్నూర్‌ మండలం పిప్పిరి గ్రామంలో బహిరంగసభలో పాల్గొంటారు.   

సీఎం పర్యటన షెడ్యూల్‌ ఇలా.. 
ఉదయం 10:20 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి హెలికాప్టర్‌లో బాసరకు బయల్దేరతారు. 
ఉదయం 11 గంటలకు బాసర హెలీప్యాడ్‌కు చేరుకుని అక్కడ నుంచి రాజన్న గెస్ట్‌హౌస్‌కు వెళతారు. 
11:10 నుంచి 12:10 వరకు బాసర శ్రీజ్ఞాన సరస్వతి ఆలయంలో అమ్మవారి దర్శనం చేసుకుంటారు. 

మధ్యాహ్నం 12:15 నుంచి 12:30 వరకు ఆలయ పునర్నిర్మాణ పనులకు భూమిపూజ చేస్తారు.
మధ్యాహ్నం 12:30 నుంచి 1:30 వరకు రిజర్వ్‌ టై­మ్‌ 
మధ్యాహ్నం 1:45 గంటలకు బాసర నుంచి ఆదిలాబాద్‌ జిల్లాకు వెళ్తా­రు. 

మధ్యాహ్నం 2.15 గంటలకు పిప్పిరికి చేరుకుంటారు. 
2.20 నుంచి 2.30 వరకు వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. 

2.30 నుంచి సాయంత్రం 4.10 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు.
సభ అనంతరం ఐఎస్‌వో సరి్టఫికెట్లు, వడ్డీలేని రుణాల చెక్కుల­ను లబి్ధదారులకు అందజేస్తారు. అలాగే సీఎం కప్‌ విజేతలకు ట్రోఫీని బ­హూ­కరిస్తారు. 
4.20 గంటలకు హైదరాబాద్‌కు తిరిగి పయనమవుతారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement