
రాత్రికి దుబాయ్ వెళ్లనున్న కేటీఆర్
: తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం రాత్రి దుబాయి వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు ఆయన దుబాయ్లో పర్యటించనున్నారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు శనివారం రాత్రి దుబాయ్‌కు బయలుదేరి వెళ్లారు. దుబాయ్ పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం 9 గంటలకు ఆయన టెకామ్(టీఈసీఓఎం) సీఈఓ, ఇతర అధికారులతో సమావేశం కానున్నారు.
ఈ సమావేశంలో మంత్రితో పాటు పరిశ్రమల శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి ప్రదీప్ చంద్ర, టీఎస్‌ఐఐసీ ఎండీ, చైర్మన్ జయేశ్‌రంజన్, ఫిక్కీ ప్రతినిధులు అరుణ్ చావ్లా, అఖిలేశ్, సుకన్య పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు తెలంగాణలో పెట్టుబడి అవకాశాలపై ఎన్‌ఆర్‌ఐలతో సమావేశం కానున్నారు. సాయంత్రం 4.30 గంటలకు దుబాయ్‌టెక్‌లో ఫార్మా, ఐటీ పారిశ్రామికవేత్తలతో పాటు మీడియాతో సమావేశమవుతారు.