ఎవరికీ వంతపాడం... | Krishna Water Board Letter To TS | Sakshi
Sakshi News home page

ఎవరికీ వంతపాడం...

May 5 2017 12:43 AM | Updated on Sep 5 2017 10:24 AM

కృష్ణా బేసిన్‌లోని నీటి పంపకాలు, ప్రాజెక్టుల నియంత్రణ, టెలిమె ట్రీ వ్యవస్థల ఏర్పాటు విషయంలో తామెవ రికీ వంత పాడటం లేదని, తటస్థ వైఖరితో ఉన్నామని కృష్ణానదీ బోర్డు స్పష్టం చేసింది.

ఏపీకి అనుకూలంగా ఉన్నామన్న ఆరోపణ అర్థరహితం
రాష్ట్రానికి వివరణ ఇస్తూ కృష్ణా బోర్డు లేఖ


సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా బేసిన్‌లోని నీటి పంపకాలు, ప్రాజెక్టుల నియంత్రణ, టెలిమె ట్రీ వ్యవస్థల ఏర్పాటు విషయంలో తామెవ రికీ వంత పాడటం లేదని, తటస్థ వైఖరితో ఉన్నామని కృష్ణానదీ బోర్డు స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా ఉన్నామన్న తెలంగాణ ఆరోపణలు అర్థరహితమని పేర్కొ ంది. ఇరు రాష్ట్రాలకు న్యాయం చేసేందుకే ప్రయత్నిస్తున్నామని స్పష్టం చేసింది. వాటాకు మించి నీటిని వినియోగం చేశారంటూ తమపై కేంద్ర జలవనరుల శాఖకు ఫిర్యాదు చేసిన బోర్డు, టెలిమెట్రీ పరికరాల అమల్లో ఏపీ చేస్తున్న జాప్యాన్ని ఎందుకు పట్టించు కోవడం లేదంటూ ఇటీవల తెలంగాణ బోర్డు కు ఘాటు లేఖ రాసిన నేపథ్యంలో దానికి వివరణ ఇస్తూ బోర్డు గురువారం రాష్ట్రానికి లేఖ రాసింది.

 పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ దిగువన 600 మీటర్ల వద్ద టెలిమెట్రీకి ప్రతిపాదించగా, దాన్ని శ్రీశైలం కుడి కాల్వ కింద 12.26 కిలోమీటర్‌ పాయింట్‌కు మార్చ డంపై వివరణ ఇచ్చింది. ప్రతిపాదిత పాయిం ట్‌ వద్ద నీటి లెవల్‌ టెలిమెట్రీ వ్యవస్థ పని చేయడానికి అనుకూలించదని, దీనిపై కేంద్ర జలసంఘం అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగానే మార్పులు చేశామని తెలిపింది.

ఇక మొదటి దశలో ప్రతిపాదించిన 18 టెలిమెట్రీల్లో సాగర్‌ ఎగువన ప్రతిపాదించిన వాటిపై తెలంగాణ అభ్యంతరాలు తెలుపగా, వాటిని ఆపించామని వివరించింది. శ్రీశైలం ప్రాజెక్టును ఏపీ, సాగర్‌ను తెలంగాణ అదుపు లో పెట్టుకొని ఇష్టానుసారం నీటిని వాడుకుం టున్నాయని, తమ ఆదేశాలను ఖాతరు చేయడం లేదని తెలిపింది. ఈ దృష్ట్యానే నీటి వాడకం అంశాన్ని కేంద్ర జల వనరుల శాఖ దృష్టికి తీసుకెళ్లాల్సి వచ్చిందని పేర్కొంది.

త్రిసభ్య కమిటీ భేటీ వాయిదా..
కాగా శుక్రవారం జరగాల్సిన కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ వాయిదా పడింది. రాష్ట్ర ఈఎన్‌సీ అందుబాటులో లేకపోవడంతో బోర్డు సమావేశాన్ని వాయిదా వేశారు. తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారన్న దానిపై మాత్రం స్పష్టత రాలేదు. ఈ భేటీ జరిగితే సాగర్‌లో 500 అడుగులు, శ్రీశైలంలో 765 అడుగుల దిగువకు వెళ్లి నీటిని తీసుకునే అంశంపై స్పష్టత వస్తుందని అంతా భావించినా వాయిదా కారణంగా నీటి వాటాల కోసం మరిన్ని రోజులు ఆగాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement