స్థానిక విద్యుత్ కళాభారతి క్రీడామైదానం నందు కొత్త కృష్ణారెడ్డి స్మారకంగా రెండు రోజుల పాటు జిల్లా ఫుట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టినభద్రాద్రి కొత్తగూడెం,
పాల్వంచ : స్థానిక విద్యుత్ కళాభారతి క్రీడామైదానం నందు కొత్త కృష్ణారెడ్డి స్మారకంగా రెండు రోజుల పాటు జిల్లా ఫుట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల స్థాయి టోర్నమెంట్ శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ పోటీలకు మొత్తం 8 జట్లు పాల్గొన్నాయి.
ఈ సందర్బంగా నిర్వహకులు కొత్త వెంకట రెడ్డి, మిరియాల కమలాకర్, అరుణ్ రెడ్డిలు క్రీడాకారులను పరిచయం చేసుకుని ప్రారంభించారు. అనంతరం జరిగిన పోటీల్లో సింగరేణి ఫుట్ బాల్‌క్లబ్ ఇల్లెందు జట్టుపై, 21 సెంచరీ ఫుట్ బాల్ క్లబ్ ఖమ్మంపై 2–0తో విజయం సాధించాయి. రెండవ మ్యాచ్‌లో పోలీస్ గ్రౌండ్ ఫుట్ బాల్ టీం, టీటీఎఫ్‌సి పాల్వంచ టీం డ్రాగా ముగించుకున్నాయి. పోటీలకు వచ్చిన క్రీడాకారులకు ఉచిత భోజన సదుపాయాలు కల్పించారు. ఈకార్యక్రమంలో ఫుట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు కెఇ.సెల్యుకస్, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, దేవసహాయం, సెక్రటరీ కె.ఆదర్ష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.