అప్పుడు కేసీఆర్‌ను అరెస్ట్‌ చేసి ఉంటే... | krishna madiga on kcr | Sakshi
Sakshi News home page

అప్పుడు కేసీఆర్‌ను అరెస్ట్‌ చేసి ఉంటే...

Dec 19 2017 2:59 AM | Updated on Aug 15 2018 9:40 PM

krishna madiga on kcr - Sakshi

హైదరాబాద్‌: ఆనాడు మిలియన్‌ మార్చ్‌ సందర్భంగా అప్పటి ప్రభుత్వం కేసీఆర్‌ను అరెస్ట్‌ చేసి ఉంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా.. సీఎంగా కేసీఆర్‌ అధికారం చెలాయించేవాడా... అని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ప్రశ్నించారు. ఎమ్మార్పీఎస్‌ మెరుపు ముట్టడి నేప థ్యంలో పోలీసులు ఆదివారం అర్ధరాత్రి సికింద్రాబాద్‌లో కృష్ణ మాదిగను అరెస్ట్‌ చేసి దక్షిణ మండలంలోని కామాటిపురా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆయనతోపాటు మరో ఐదుగురిపై రాంగోపాల్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌లో పలు కేసులు నమోదు చేశారు.

అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని, ట్రాఫిక్‌కు అంతరా యం కలిగించారని కార్ఖానా పోలీసుస్టేషన్‌లో కూడా కృష్ణ మాదిగపై కేసులు నమోదు చేశారు. ఆయనతోపాటు ఎమ్మార్పీఎస్‌ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు రాగాటి సత్యం మాదిగ, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు లత మాధవిని సోమవారం సాయంత్రం వరకు కామాటిపురా పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించారు. అనంతరం వారితోపాటు మరో 9 మందిని సికింద్రాబాద్‌లోని 9వ మెట్రోపాలి టన్‌ మేజిస్ట్రేట్‌ శ్రీలత ఇంటికి తరలించి ఆమె ముందు హాజరుపర్చారు. వారికి మేజిస్ట్రేట్‌ 14 రోజుల వరకు రిమాండ్‌ విధించారు.

మేజిస్ట్రేట్‌ ఆదేశాల మేరకు నిందితులను చంచల్‌గూడ జైలు కు తరలించారు. అంతకుముందు కామాటిపురా పోలీస్‌స్టేషన్‌ వద్ద కృష్ణ మాదిగ విలేకరులతో మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతున్న తమపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి అరెస్ట్‌ చేయడం దారుణ మన్నారు. రాత్రంతా పోలీస్‌స్టేషన్‌లో బంధించడం అప్రజాస్వామికమన్నారు.


పోలీసుస్టేషన్‌ వద్ద ఉద్రిక్తత
సోమవారం ఉదయం ఎమ్మార్పీఎస్‌ నాయకులు, కార్యకర్తలు, న్యాయవాదులు పెద్ద ఎత్తున కామాటిపుర పోలీస్‌స్టేషన్‌కు తరలిరావడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.టిఫిన్‌తోపాటు రోజువారీగా కృష్ణ మాదిగకు మందులు ఇవ్వాల్సిన అవసరముందని చెప్పినా పోలీసులు అనుమతించలేదు. కృష్ణ మాదిగను కలుస్తామని కార్యకర్తలు పట్టుబట్టడంతో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల చర్యను నిరసిస్తూ నగరంలోని పలుచొట్ల సీఎం దిష్టిబొమ్మలను దహనం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement