కేసీఆర్తో కొండా సురేఖ భేటీ | Konda Surekha and her husband Murali meet KCR | Sakshi
Sakshi News home page

కేసీఆర్తో కొండా సురేఖ భేటీ

Mar 18 2014 2:07 PM | Updated on Sep 2 2017 4:52 AM

కేసీఆర్తో కొండా సురేఖ భేటీ

కేసీఆర్తో కొండా సురేఖ భేటీ

రాష్ట్ర మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి టీఆర్ఎస్ చేరేందుకు పావులు కదుపుతున్నారు.

హైదరాబాద్: రాష్ట్ర మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి టీఆర్ఎస్ చేరేందుకు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో కొండా సురే్ఖ దంపతులు ఈరోజు సమావేశమయ్యారు. అయితే కొండా దంపతులు కాంగ్రెస్ పార్టీని వదిలి టీఆర్ఎస్లో చేరడం ఖాయమని, అధికారికంగా ప్రకటించడమే మిగిలిందని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి.

సురేఖకు వరంగల్ ఈస్ట్ అసెంబ్లీ సీటును కేసీఆర్ ఆఫర్ చేశారని సమాచారం. అయితే గతంలో తాను ప్రాతినిథ్యం వహించిన పరకాల కోసం పట్టుబట్టినా కేసీఆర్ ఒప్పుకోకపోవడంతో వరంగల్ ఈస్ట్ స్థానంలో పోటీ చేసేందుకు ఆమె అంగీకరించినట్టు తెలిసింది. కొండా మురళికి భూపాల్పల్లి టికెట్ ఇచ్చేందుకు కేసీఆర్ అంగీకరించారని సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement