విద్యుత్‌షాక్‌లతో కోనాయిపల్లి విలవిల | konaipalli village get shocked | Sakshi
Sakshi News home page

విద్యుత్‌షాక్‌లతో కోనాయిపల్లి విలవిల

Dec 9 2014 11:25 PM | Updated on Sep 2 2017 5:54 PM

విద్యుత్‌షాక్‌లతో కోనాయిపల్లి విలవిల

విద్యుత్‌షాక్‌లతో కోనాయిపల్లి విలవిల

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఖరీదు ఓ నిండి ప్రాణాన్ని బలిగొనడమే గాక మరో 15 మంది గాయపడ్డారు.

సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా ఒకరి మృతి
15 మందికి గాయాలు
మృతదేహంతో విద్యుత్ సబ్‌స్టేషన్ ముట్టడి
పోలీసుల హామీతో ఆందోళన విరమణ
ఫిర్యాదు చే స్తున్నా పట్టించుకోలేదంటున్న గ్రామస్తులు

 
తూప్రాన్ : విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఖరీదు ఓ నిండి ప్రాణాన్ని బలిగొనడమే గాక మరో 15 మంది గాయపడ్డారు. అయితే సంబంధిత అధికారుల తీరును నిరసిస్తూ గ్రామ పరిధిలోని సబ్ స్టేషన్‌ను ముట్టడించి ఫర్నిచర్, అద్దాలను ధ్వంసం చేశారు. అయితే పోలీసుల జోక్యంతో గ్రామస్తులు శాంతించారు. ఈ సంఘటన మండలంలోని కోనాయిపల్లి (పీటీ)లో మంగళవారం చోటు చేసుకుం ది. వివరాలు ఇలా ఉన్నాయి..  గ్రామానికి చెందిన శెట్టి నరసింహులు, భారతమ్మ దంపతులకు ముగ్గురు సంతానం.

వీరిలో ఇద్దరు ఆడపిల్లలకు వివాహాలు కాగా కుమారుడు శ్రీకాంత్ (20) కాళ్లకల్ గ్రామ సమీపంలోని ఓ ప్రైవేట్ పరిశ్రమంలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. అయితే మంగళవారం ఉదయం 6.30 గంటల సమయంలో  శ్రీకాంత్ సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా.. విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే దుర్మరణం చెందాడు. దీంతో విషయాన్ని గమనించిన ఇరుగుపొరుగు వారు అప్పటికే  పనులకు వెళ్లిన శ్రీకాంత్ తల్లిదండ్రులకు సమాచారాన్ని చేరవే స్తూ బాధితుడిని కొంపల్లిలోని లీలా ఆస్పత్రికి తరలిం చారు. పరీక్షలు నిర్వహించిన  వైద్యులు మృతి చెందాడ ని ధ్రువీకరించారు.

విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద మృతదేహంతో ఆందోళన
శ్రీకాంత్ మృతికి ట్రాన్స్‌కో అధికారులే కారణమంటూ బాధిత కుటుంబ సభ్యు లు, గ్రామస్తులు మృతదే హాన్ని గ్రామ సమీపంలో గల విద్యుత్ సబ్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ఆందోళనకు దిగారు. అక్కడి గదుల కిటికీల అద్దాలు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ సంతోష్‌కుమార్ సిబ్బంది గ్రామానికి చేరుకుని ఆందోళనకారులకు సర్దిచెప్పే యత్నం చేయడంతో వారు తిరగబడ్డారు.

దీంతో ఎస్‌ఐ విషయాన్ని సీఐ సంజయ్ కుమార్‌కు తెలపడంతో ఆయన శివ్వంపేట ఎస్‌ఐ రాజేష్, సిబ్బందిని వెంటబెట్టుకుని గ్రామానికి చేరుకుని వారితో మాట్లాడారు. విద్యుత్ అధికారులతో చర్చించి నష్టపరిహారంతో పాటు విద్యుత్ అధికారులపై కేసు నమోదు చేస్తామని హమీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ముమ్మాటికీ అధికారుల నిర్లక్ష్యమే..
గ్రామంలోని ఓవర్‌హెడ్ ట్యాంకు వద్ద ఉన్న సింగిల్ ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్‌లో ఎర్తింగ్ లోపంతోనే దీని పరిధిలోని ఇళ్లకు సోమవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో షాక్ రావడం జరిగిందని గ్రామస్తులు తెలిపారు. ఇదే విషయాన్ని విద్యుత్ అధికారులకు చెప్పినా ఎవరూ స్పందించలేదన్నారు. అధికారుల నిర్లక్ష్యమే గ్రామానికి చెందిన శ్రీకాంత్ ప్రాణం తీసిందని గ్రామస్తులు ఆరోపించారు. అదే గ్రామానికి చెందిన అంగన్‌వాడీ కార్యకర్త మన్నే సురేఖ ఇంట్లో ఉదయం వంట చేసేందుకు రైస్ కుక్కర్‌తో అన్నం వండేందుకు స్విచ్ ఆన్ చేయడంతో ఒక్కసారిగా షాక్‌కు గురై   స్పృహ కోల్పోయింది.

వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లడంతో ప్రా ణాపాయ స్థితి నుంచి బయటపడింది. ఇలా గ్రామానికి చెందిన బక్క శోభ, మ హిపాల్, మన్నే రవి, మల్లిక, పృథ్వీరా జ్, మంగమ్మలతో పాటు మరికొందరు గ్రామస్తులు విద్యుదాఘాతానికి గురై గా యపడ్డారు. ఈ విషయంపై ఏడీఈ వినోద్‌రెడ్డిని వివరణ కోరగా విద్యుదాఘాతంతో  మృతి చెందిన యువకుడి కుటుంబానికి తమ శాఖ తరఫున రూ. 2 లక్షల నష్టపరిహారాన్ని మూడు నెలల్లో అందిస్తామని తెలిపారు.  మండలంలోని  సింగిల్ ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్లకు గల ఎర్తింగ్‌లను సరి చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement