ఓ వ్యక్తిని దుండగులు దారుణంగా చంపేశారు. అతడి వివరాలు తెలియకుండా మృతదేహంపై డీజిల్ పోసి నిప్పంటించి కాల్చే శారు.
గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్య
పరిగి: ఓ వ్యక్తిని దుండగులు దారుణంగా చంపేశారు. అతడి వివరాలు తెలియకుండా మృతదేహంపై డీజిల్ పోసి నిప్పంటించి కాల్చే శారు. వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధి లోని మల్లెమోనిగూడ శివారులో మంగళవారం ఉదయం ఈ ఘటన వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. మల్లెమోనిగూడ శివారు ప్రాంత రైతులకు ఓ పొలంలో తగలబడిన మృతదేహం కనిపించింది. సమాచారం అందు కున్న పరిగి ఎస్‌ఐ నగేశ్, ఐడీ పార్టీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
హతుడికి సుమారు 35 ఏళ్లు ఉంటాయని భావిస్తున్నారు. ఘటనా స్థలంలో ఓ డీజిల్ డబ్బా, మద్యం సీసా, సిగరెట్ పెట్టె, దాదాపు 200 రూపాయలు లభ్యమయ్యాయి. పోలీసు జాగిలాలు ఘటనా స్థలంలోనే తచ్చాడాయి. క్లూస్‌టీం సిబ్బంది వివరాలు సేకరించారు. హతుడికి బాగా తెలిసిన వ్యక్తులే అతడిని ఇక్కడికి తీసుకొని వచ్చి మద్యం తాగించి పథకం ప్రకారం చంపేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ఆస్పత్రికి తరలించారు.