ఎల్బీనగర్‌లో 15 రోజుల క్రితం అపహరణకు గురైన మీనా అనే ఏడేళ్ల పాప ఆచూకీ ఇంకా తెలియరాలేదు.
హైదరాబాద్: ఎల్బీనగర్‌లో 15 రోజుల క్రితం అపహరణకు గురైన మీనా అనే ఏడేళ్ల బాలిక ఆచూకీ ఇంకా తెలియరాలేదు. కిరాణా షాపుకని బయటకు వెళ్లిన మీనా కనిపించకుండా పోయింది. ఎంతసేపైనా చిన్నారి ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసి ఇన్ని రోజులు కావస్తున్నా పోలీసులు తమ పాప ఆచూకీ కనిపెట్టలేకపోయారు మీనా తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తమ పాప జాడ కనిపెట్టాలని వేడుకుంటున్నారు. తమ పాప సురక్షితంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నారు.