డాల్ఫినో డాల్‌..

KGBV Schools Implemented New Technology Delphino With The Help Of UNESCO - Sakshi

సాక్షి, ఆసిఫాబాద్‌ : విద్యార్థుల్లో ఉత్తేజం.. సులభంగా అర్థం చేసుకునేందుకు కస్తూరిబా విద్యాలయాల్లో సరికొత్త పరిజ్ఞానాన్ని వాడుతున్నారు. యూనిసెఫ్‌ సహకారంతో స్వస్త్‌ ఫ్లస్‌ పథకం కింద మాట్లాడే పుస్తకాలను తీసుకొ చ్చారు. జిల్లాలోని 8 కేజీబీవీల్లో వీటిని విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ పుస్తకాల పేజీపై డాల్ఫినో అనే పరికరాన్ని పెట్టగానే పుస్తకంలోని బొమ్మల గురించి చెప్పడంతో పాటు కథనాంశాలను విద్యార్థులకు వివరిస్తోంది.   కుమురం భీం జిల్లాలో మొత్తం 15 కేజీబీ వీలు ఉన్నాయి. నిరుపేద బాలికలకు విద్యన ందించాలనే సంకల్పంతో ప్రతి మండలానికి ఒక కేజీబీవీని ఏర్పాటు చేశారు. ఆ మండలంలోని బాలికలకు 6వ తరగతి నుంచి ఇం టర్‌ వరకూ విద్యతో పాటు వసతిగృహ సదుపాయాన్ని కూడా కల్పించారు. విద్యార్థినులకు సరికొత్త పరిజ్ఞానంతో సులభంగా ఇంగ్లీష్‌ అర్థమయ్యేలా డాల్ఫిన్‌ పుస్తకంలోని బొమ్మల గురించి చెప్పడంతో పాటు మాటల రూపంలో వస్తున్న అక్షరాలు ఉత్తేజపరుస్తున్నాయి. ఈ మాట్లాడే పుస్తకాలతో విద్యార్థులు చదువుపై ఆసక్తి చూపుతున్నారు. 

యూనిసెఫ్‌ సహకారంతో..
యూనిసెçఫ్‌ సహకారంతో స్వస్త్‌ ప్లస్‌ పథకం కింద ప్రతి పాఠశాలకు వంద వరకూ కథల పుస్తకాలను ప్రవేశపెట్టిన అధికారులు దానికి మరింత సాంకేతికతను జోడించి మాట్లాడే పుస్తకాలను తయారు చేశారు. 2018– 19 విద్యా సంవత్సరానికి గానూ దాదాపు 200 వరకూ పుస్తకాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇవి సత్ఫలితాలు ఇవ్వడంతో ఈసారి మరిన్ని పుస్తకాలను పంపిణీ చేశారు. జిల్లాలోని 8 కేజీబీవీలకు వీటిని అందించారు. ఒక్కో కేజీబీవీకి 100 ఇంగ్లీష్, 100 తెలుగు భాషల్లో పుస్తకాలను అందజేశారు. వీటి ద్వారా ప్రయోగాత్మకంగా విద్యబోధన చేపడుతున్నారు.

ద్యార్థుల్లో సృజనాత్మకత పెంపు..
మాట్లాడే పుస్తకాలను విద్యార్థులకునుగుణంగా తయారు చేశారు. ఇంగ్లిష్‌ పదాలు పలకడం కష్టతరంగా ఉన్న పదాలను పుస్తకం మాట్లాడడంతో సులభంగా అర్థమవుతుంది. దీంతో పాటు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడానికి ఇవి దోహదపడుతున్నాయి. ఈ పుస్తకాల్లో నీతి కథలైన లెట్స్‌ మీ హిచర్‌ ది మ్యూజిక్, ఏ లెస్సన్‌ ఫర్‌ ది సర్పంచ్, బాలల హక్కులు, ఆరోగ్యం, పరిశుభ్రత వంటి నీతి కథలు ఉన్నాయి. వీటి ద్వారా విద్యార్థుల్లో చదివేం దుకు కుతుహలం ఏర్పడుతోంది. వీటి పై ఉన్న బొమ్మల మీద డాల్ఫినో పరికరాన్ని ఉంచితేబొమ్మ గురించి పూర్తిగా చెప్పడంతో పాటుగా చదవుతుంది. ఈ పరిరాన్ని కర్ణాటకకు చెందిన ఐస్‌ పార్కు సంస్థ రూపొందించింది. విద్యుత్‌ చార్జింగ్‌ చేయడం ద్వారా ఇది పనిచేస్తుంది. 6 నుంచి 7వ తరగతి విద్యార్థినులకు ఈబొమ్మల పాఠాలు ఉపయోగపడుతున్నాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top