కిరోసిన్‌ ధరల మంట | Kerosene Prices Are Increased In Sangareddy District | Sakshi
Sakshi News home page

కిరోసిన్‌ ధరల మంట

Sep 5 2019 9:55 AM | Updated on Sep 5 2019 9:56 AM

Kerosene Prices Are Increased In Sangareddy District - Sakshi

సాక్షి, జోగిపేట(అందోల్‌): ప్రజా పంపిణీ కిరోసిన్‌ లీటరుపై రూ.1 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన ధర ఈ నెల నుంచే అమలులోకి వస్తుంది. ఈ నెలలో లీటరుకు రూ.34, అక్టోబర్‌లో రూ.35కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అధికారులు చెబుతున్నారు. వీలైనంత వరకు కిరోసిన్‌ వినియోగాన్ని తగ్గించేలా ప్రభుత్వం తరచూ ఇప్పటికే కట్‌ చేశారు . ప్రతి నెలా 1.26 లక్షల లీటర్ల కిరోసిన్‌ సరఫరా చేస్తున్నారు. ధరలు పెంచడంతో ఆహార భద్రత కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు భారం తప్పడం లేదు. 2016లో కిరోసిన్‌ ధర లీటర్‌ రూ.19 ఉండగా, 2017లో రూ.24కు చేరింది. 2018లో రూ.29కు పెంచారు.

ప్రస్తుత కోటా వచ్చే సరికి ఏకంగా రూ.34లకు చేరింది. ఈ లెక్కన మూడేళ్లలో రాయితీ కిరోసిన్‌పై లీటరుకు రూ.15 పెంచినట్లయ్యింది. నిరుపేదలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై కిరోసిన్‌ను పంపిణీ చేస్తోంది. ఇటీవల దీని వినియోగం భారీగా తగ్గింది. ప్రస్తుతం కిరోసిన్‌పై వంట చేసుకునే వారు చేతివేళ్లపై లెక్క పెట్టే సంఖ్యలోనే ఉన్నారు. గ్రామాల్లో స్నానానికి నీళ్లు వేడి చేసుకునేందుకు కొందరు ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఒక్కరూ గ్యాస్‌ పొయ్యిలనే వినియోగిస్తున్నారు. గతంలో కార్డుకు 15 లీటర్ల చొప్పున కిరోసిన్‌ పంపిణీ చేసేవారు. ప్రస్తుతం లీటరుకు వచ్చింది. 

జిల్లాలో నెలకు 1.26 లక్షల లీటర్ల సరఫరా 
జిల్లాలో 3.70 లక్షల లీటర్లు కిరోసిన్‌ పంపిణీ చేసేవారు. గ్యాస్‌ కనెక్షన్‌ ఉన్న వారికి కిరోసిన్‌ కోటాను కట్‌ చేయాలన్న ఉత్తర్వులు రావడంతో వారిని గుర్తించి తొలగించాం. ప్రస్తుతం ప్రతి నెలా 1.26 లక్షల లీటర్ల కిరోసిన్‌ను జిల్లాలో పంపిణీ చేస్తాం. సెప్టెంబర్‌లో రూ. 34కు, అక్టోబర్‌లో రూ.35కు పెంచి విక్రయించాలని ఇప్పటికే ఉత్తర్వులు వచ్చాయి. గ్యాస్‌ కనెక్షన్‌ లేని దీపం కనెక్షన్‌ ఉన్న 22వేల మందికి కూడా రాయితీ కిరోసిన్‌ సరఫరా చేస్తాం. 
– శ్రీకాంత్‌రెడ్డి,డీఎస్‌ఓ, సంగారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement