
సాక్షి, హైదరాబాద్: కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ గురువారం మధ్యాహ్నం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. దేశంలోనే రెండో అత్యుత్తమ పోలీస్ స్టేషన్ అవార్డును పంజాగుట్ట పీఎస్ దక్కించుకున్న నేపథ్యంలో ఆయన ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా పోలీసు స్టేషన్‌లో అధికారులు, సిబ్బందితో ముచ్చటించారు. పోలీసు స్టేషన్‌లోని మౌలిక సదుపాయాలు, కేసుల పరిష్కారాలు, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాల అమలును ఆయన పరిశీలించారు. కేరళ సీఎం విజయన్ రాక సందర్భంగా ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.