వైస్రాయ్ ఘటనలో కీలక పాత్ర కేసీఆర్‌దే: ఎర్రబెల్లి | Kcr to play key role in Viceroy incident, says Errabelli dayakar rao | Sakshi
Sakshi News home page

వైస్రాయ్ ఘటనలో కీలక పాత్ర కేసీఆర్‌దే: ఎర్రబెల్లి

Nov 26 2014 3:26 AM | Updated on Aug 15 2018 9:22 PM

వైస్రాయ్ ఘటనలో కీలక పాత్ర కేసీఆర్‌దే: ఎర్రబెల్లి - Sakshi

వైస్రాయ్ ఘటనలో కీలక పాత్ర కేసీఆర్‌దే: ఎర్రబెల్లి

ఎమ్మెల్యేల అభీష్టం మేరకు 1995లో వైస్రాయ్ హోటల్ వేదికగా అధికార మార్పిడి జరిగిందే తప్ప, వెన్నుపోటు కాదని తెలంగాణ టీడీఎల్‌పీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు.

సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల అభీష్టం మేరకు 1995లో వైస్రాయ్ హోటల్ వేదికగా అధికార మార్పిడి జరిగిందే తప్ప, వెన్నుపోటు కాదని తెలంగాణ టీడీఎల్‌పీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. అప్పుడు కేసీఆర్ కీలక పాత్ర పోషించారన్నారు. మంగళవారమిక్కడ టీడీఎల్‌పీ కార్యాలయంలో ఆయన ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీర య్య, వివేకానందతో కలసి మాట్లాడారు.
 
  ‘వైస్రాయ్ ఘటనపై మంత్రి హరీశ్ అవాకులు చెవాకులు పేలే ముందు.. తన మామ కేసీఆర్‌ను అడిగితే అన్ని విషయాలు చెబుతారు. ఆ ఘటన తర్వాత ఏర్పాటైన చంద్రబాబు మంత్రివర్గంలో కేసీఆర్ కీలక పాత్ర పోషించారు’ అని అన్నారు. చనిపోయిన రైతుల కుటుంబాలకు టీడీపీ ఆర్థిక సాయం చేస్తుంటే అవహేళన చేయడం సమంజసం కాదన్నారు. శాసనసభలో టీడీపీకి కార్యాలయం కూడా కేటాయించకుండా ప్రభుత్వం కక్ష సాధిస్తోందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement