ప్రజలే మా బాస్ లు: కేసీఆర్ | kcr speech in TRS pleanery | Sakshi
Sakshi News home page

ప్రజలే మా బాస్ లు: కేసీఆర్

Apr 24 2015 1:24 PM | Updated on Aug 15 2018 9:27 PM

ప్రజలే మా బాస్ లు: కేసీఆర్ - Sakshi

ప్రజలే మా బాస్ లు: కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ప్లీనరీ సమావేశంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

తెలంగాణ రాష్ట్ర సమితి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ప్లీనరీ సమావేశంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర పాలనలో తనకు ప్రజలే 'బాస్'లు అని ప్రశంసించారు.

ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

  • లాఠీ దెబ్బలు తిన్నారు.. జైళ్లకు వెళ్లారు.
  • బంగారు తెలంగాణ కోసం పాటుపడ్డారు.
  • తెలంగాణ ప్రజలు సొంత రాష్ట్రం కోసం ఎన్నో బాధలు పడ్డారు.
  • ఈ కష్టంలో భాగమైన ప్రతి ఒక్కరినీ కృతజ్ఞతలు.
  • 2001 లో పార్టీ ప్రారంభమైనప్పుడు నేను ఒక్కడినే.
  • తర్వాత లక్షల మంది వచ్చి చేరారు.
  • ఎన్ని ఆరోపణలు వచ్చినా నాతో కలిసి పని చేశారు.
  • ఉద్యమాలతో ప్రారంభమైన పార్టీని నిలబెట్టింది మాత్రం ప్రజలే.
  • పార్టీకి అధ్యక్షుడినే అయినా ప్రతి ఒక్క కార్యకర్త సలహాని స్వీకరించాం.
  • ఎన్నో జయాలు చూశాం.. అపజయాలూ చూశాం.
  • ఎన్ని ఇబ్బందులు వచ్చినా 14 ఏళ్లుగా పార్టీలో కొనసాగుతూనే ఉన్నారు.
  • పోరాటం అంటే ఎన్నడూ వెన్ను చూపలేదు మన ప్రజలు.
  • ఎన్ని కష్టాలొచ్చినా ఉద్యమాన్ని వీడలేదు.

Advertisement
 
Advertisement
Advertisement